ఫిలిప్పీన్స్ రాజధాని ప్రాంతంలోని ఓ ఐస్ ప్లాంట్ నుంచి అమ్మోనియా వాయువు లీక్ అయిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఫాక్టరీ ఉద్యోగులు సహా 90 మందికిపైగా అస్వస్థతకు గురయ్యారు.
ఈ ఘటనతో ఫ్యాక్టరీ సమీపంలోని నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. అస్వస్థతకు గురైన వారందరికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. అందులో 20 మందికిపైగా శ్వాసతీస్కోవడంలో ఇబ్బందులు, కళ్లు, చర్మ సంబంధి సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.