శునకాలు మనకు చిన్న చిన్న పనులు చేసి పెడుతూ సహాయకారిగా ఉంటాయి. ఇంట్లో చిన్న పిల్లలను చూసుకుంటాయి. ఈ ఆస్ట్రేలియన్ షెపర్డ్ మాత్రం ఒకడుగు ముందుకేసి పెయింట్ బ్రష్ నోట పట్టింది. అదిరిపోయే బొమ్మ వేసి ఔరా అనిపిస్తోంది.
కాన్వాస్‌పై అందమైన బొమ్మలేస్తున్న శునకం - ట్రెండింగ్
గెంతుతూ ఫీట్లు చేసే శునకాలను చూసే ఉంటారు. కాన్వాస్‌పై అందంగా బొమ్మలేసే బుజ్జి కుక్కపిల్లను ఎప్పుడైనా చూశారా? దీనిని చూశారంటే 'భలేగా ఉందే' అనక మానరు.
శునకం వైరల్ వీడియో
'సీక్రెట్' అని పిలుచుకునే ఈ శునకం.. మేరీ అనే తన యజమానురాలికి ఇంటి పనుల్లో సహాయం కూడా చేస్తుంది. అప్పుడు అర్థం కాని గీతలు గీసే ఈ శునకం.. తొలిసారి గుర్తు పట్టగలిగేలా పువ్వు ఆకృతిని గీసిందని సంబురపడిపోతోంది మేరీ. సీక్రెట్ గీసిన ఈ బొమ్మకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
ఇదీ చూడండి:అంబులెన్సు వెంట శునకం పరుగులు- వీడియో వైరల్