పెంపుడు కుక్కకు కరోనా వైరస్.. ఎక్కడంటే? - Coronavirus in Hong Kong
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ జంతువులకు కూడా సోకుతోంది. హాంకాంగ్‌లో ఓ పెంపుడు కుక్కకు వైరస్ లక్షణాలు స్వల్పంగా ఉన్నట్లు గుర్తించారు వైద్యులు. ఇలాంటి కేసు ఇక్కడ ఇదే మొదటిది అని చెబుతున్నారు.
పెంపుడు కుక్కకు కరోనా వైరస్.. ఎక్కడంటే?
By
Published : Feb 28, 2020, 6:45 PM IST
|
Updated : Mar 2, 2020, 9:25 PM IST
హాంకాంగ్‌లో ఓ పెంపుడు కుక్కకు కరోనా వైరస్ లక్షణాలు స్వల్పంగా ఉన్నట్లు గుర్తించారు వైద్యులు. వైరస్‌తో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ 60ఏళ్ల వృద్ధురాలి కుక్కకు వైద్యుల కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో ఆ శునకానికి కూడా వైరస్ లక్షణాలు ఉన్నట్లు తేలింది. అయితే ఆ దేశ వ్యవసాయ, మత్స్యసంపద పరిరక్షణ విభాగం ఈ విషయాన్ని తోసిపుచ్చింది.
వైరస్ సోకిన కుక్కను జంతు కేంద్రంలో ఉంచి పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. జంతువులకు కరోనా వైరస్ సోకడం దేశంలో ఇదే మొదటి సారని వెల్లడించారు.
అయినప్పటకీ...
కుక్కలు, పిల్లులు వంటి పెంపుడు జంతువులకు వైరస్ సోకినట్లు గానీ, జంతువుల నుంచి మానవులకు వ్యాపించినట్లు గానీ ఎటువంటి ఆధారాలు లేవని హాంకాంగ్ వ్యవసాయ, మత్స్య సంపద పరిరక్షణ విభాగం తెలిపింది. అయితే వైరస్ సోకిన వారి పెంపుడు జంతువులను 14 రోజులు పరిశీలనలో ఉంచాలని సూచించింది.
ఏ దేశంలో ఎంతమంది?
కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే 83వేల మందికి పైగా సోకగా.. 2,800 మంది మృతి చెందారు. చైనాలోనే 2,788 మంది ప్రాణాలు కోల్పోగా... 78,824మంది ఈ వైరస్ బారిన పడ్డారు.