మయన్మార్‌లో సైనిక పాలనకు వ్యతిరేకంగా నిరసనలు హోరెత్తుతున్న క్రమంలో నగదు కొరత వేధిస్తోంది. భవిష్యత్ అవసరాల దృష్ట్యా బ్యాంకుల్లో దాచుకున్న సేవింగ్స్‌ను అక్కడి ప్రజలు అధిక మొత్తంలో విత్‌డ్రా చేస్తున్నందున ఈ సమస్య తలెత్తుతోంది. ఫలితంగా వస్తు సేవల ధరలు తారస్థాయికి చేరుకుంటున్నాయి.
ఫిబ్రవరి 1న ఆంగ్ సాన్ సూకి నేతృత్వంలోని పౌర ప్రభుత్వాన్ని కూలదోసి.. సైనిక ప్రభుత్వం అధికారాన్ని చేపట్టిన నాటి నుంచి మయన్మార్‌లో ఆర్థిక సంక్షోభం నెలకొంది. ఈ పరిస్థితులను జుంటా నేతృత్వంలోని సైనిక ప్రభుత్వం ఏమాత్రం పరిష్కరించలేకపోయిందని క్యోడో వార్తా సంస్థ నివేదించింది. దేశంలోని పెద్ద నగరమైన యాంగూన్‌లో.. ప్రజలు ఉదయం వేళల నుంచే నగదు కోసం బ్యాంకుల ముందు బారులు తీరుతున్న దృశ్యాలు ఇందుకు సాక్ష్యాలుగా కనిపిస్తున్నాయి.
నగదు ఉపసంహరణపై పరిమితులు..