తెలంగాణ

telangana

ETV Bharat / international

లద్దాఖ్​ ప్రతిష్టంభన ఇంకా వీడంది ఇందుకే...

లద్దాఖ్​ ప్రతిష్టంభనకు తెర దించేందుకు భారత్​, చైనా అనేక నెలలుగా ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే 8 సార్లు చర్చలు జరిపాయి. బలగాల ఉపసంహరణపై ఏకాభిప్రాయానికీ వచ్చాయి. అయినా... వాస్తవాధీన రేఖ వద్ద పరిస్థితి ఎందుకు మారడం లేదు?

india vs china
ముందు మీరు ఆ తర్వాతే మేము.. ఇలా ఇంకెన్నాళ్లు?

By

Published : Jan 14, 2021, 5:49 PM IST

తూర్పు లద్దాఖ్​లోని వాస్తవాధీన రేఖ వెంబడి నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించే దిశగా భారత్​, చైనా అడుగులు వేస్తున్నాయి. ఈ మేరకు బలగాల ఉపసంహరణకు ఇరు దేశాలు అంగీకరానికి వచ్చాయి. అయితే.. ఇది ఆచరణలో ఎలా సాధ్యమవుతుందన్నదే ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

ఈనెల 15న జరగనున్న సైనిక దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత సైన్యాధిపతి జనరల్​ మనోజ్​ ముకుంద్​ నరవణె దిల్లీలో మంగళవారం మాట్లాడారు. చర్చల ద్వారా ప్రతిష్టంభనకు స్నేహ పూర్వక పరిష్కారం లభిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే.. ఇందుకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు ఓ సీనియర్​ అధికారితో ఈటీవీ భారత్​ మాట్లాడింది. కానీ, చర్చల కోసం ఇరు దేశాలు తలో తేదీని చెబుతున్నాయని ఆయన అన్నారు. లఖ్​నవూకు చెందిన ఓ సామెత 'ముందు మీరు ఆ తర్వాత మేము' (పెహెలే ఆప్​ మిజాజ్​)' తరహాలో వ్యవహరిస్తున్నాయని చమత్కరించారు.

"భారత దళాలే ముందు వెనక్కి తగ్గాలని చైనా వాదిస్తోంది. చైనా దళాలే ముందు వెనక్కి తగ్గాలని భారత్​ అంటోంది. ఫింగర్​ 4 ప్రాంతాన్ని చైనా ఖాళీ చేయాలని భారత్​ అడుగుతోంది. కాగా.. పాంగాంగ్​ సరస్సు దక్షిణ ఒడ్డును భారత్​ ఖాళీ చేయాలని డ్రాగన్​ అడుగుతోంది. మే నెలలో పాంగాంగ్​ సరస్సు ఉత్తర ఒడ్డున పీపుల్స్​ లిబరేషన్​ ఆర్మీ (పీఎల్​ఏ) సైనికులు మొదటగా మోహరించి ఉద్రిక్తతలకు తెర తీసినందున... మొదట చైనానే వెనక్కి తగ్గాలని జనరల్​ నరవణె అంటున్నారు. ఆగస్టులో ఉన్నట్లుగానే ప్రస్తుతం మేం ఉన్నాం. మేం ఇలా వస్తామని చైనీయులు ఊహించి ఉండరు."

--భారత సైనికాధికారి.

పాంగాంగ్​ వద్ద ఇదీ వివాదం..

భారత్​, చైనా సరిహద్దుగా భావిస్తున్నవాస్తవాధీన రేఖ పాంగాంగ్​ సరస్సు మీద నుంచి పోతుంది. ఇరు దేశాలు కచ్చితమైన సరిహద్దులను ఇక్కడ నిర్ధరించుకోలేదు. ఈ సరస్సు ఉత్తర తీరాన బంజరు పర్వతాలు ఉన్నాయి. వీటిని ఇరు దేశాల సైన్యాలు 'ఫింగర్స్‌'గా అభివర్ణిస్తాయి. ఈ ఫింగర్స్​ దగ్గర లెక్కలే ప్రస్తుతం వివాదానికి కారణంగా మారాయి. గతేడాది మే 5-6 తేదీల్లో పాంగాంగ్​ సరస్సు ఉత్తర ఒడ్డులోని ఫింగర్​4 ప్రాంతాన్ని చైనా పీపుల్స్​ లిబరేషన్​ ఆర్మీ దళాలు ఆక్రమించాయి. ఆ ప్రాంతంలో తాత్కాలిక ఆవాసాలను ఏర్పాటు చేసుకున్నాయి.

బలగాలను పెంచుతూ...

భారత్‌ 'ఫింగర్‌ 8' నుంచి వాస్తవాధీన రేఖ వెళుతుందని చెబుతోంది. అయినా ఫింగర్​ 3 వరకు తమదేనని చైనా వాదిస్తోంది. అంతకుముందు.. ఫింగర్​ 8 నుంచి ఫింగర్​ 4 వరకు చైనా గస్తీ నిర్వహించగా.. ఫింగర్​ 4 నుంచి ఫింగర్​ 8 వరకు భారత్​ గస్తీ చేపట్టింది. ఆగస్టు 29-30 అర్ధరాత్రి భారత దళాలు.. పాంగాంగ్​ దక్షిణ ఒడ్డును స్వాధీనం చేసుకున్నాయి. చైనా స్థావరాలు ఉన్న మాల్డో గారిసన్​పై ఈ శిఖరాల నుంచి గురిపెట్టవచ్చు. దీంతో చైనా ఆధిపత్యం ఒక్కసారిగా చేజారింది. ఈ పరిస్థితుల్లో ఇరు దేశాలు భారీ సంఖ్యలో బలగాలను పెంచుతూ వచ్చాయి.

ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇప్పటివరకు భారత్​, చైనా మధ్య ఎనిమిది విడతల కమాండర్​ స్థాయి చర్చలు జరిగాయి. ఆరో దఫా సమావేశంలో.. ఈ ఫింగర్ల ప్రాంతాల్లో మరిన్ని దళాలను పెంచుకోవద్దని, ఏక పక్షంగా పరిస్థితిని మార్చుకోవద్దని నిర్ణయానికి వచ్చాయి. కానీ, ఇప్పటివరకు ఆ నిర్ణయాల్లో పురోగతి కనిపించిన దాఖలాలు లేవు.

--సంజీవ్​​ బారువా

ఇదీ చూడండి:10వేల మంది చైనా సైనికులు వెనక్కి!

ABOUT THE AUTHOR

...view details