Plane Tyre Burst: ప్రయాణిస్తున్న సమయంలో బైక్, కార్ ఏదైనా సడెన్‌గా ఆగడం లేదా పంక్చర్ అయితే పడే ఇబ్బంది మామూలుగా ఉండదు. మారుమూల ప్రాంతంలో అయితే ఇక నరకయాతనే. చేసేదేముంది.. తోసుకుంటూ వెళ్లిపోవడమే. అదే రన్‌వేపై విమానం టైర్ పంక్చర్ అయితే ఏం చేస్తారు? ఇక్కడా అదే జరిగింది. అంతా కిందకు దిగి తలో చేయి వేసి విమానాన్ని ముందుకు తోశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
Tara Airlines Nepal
నేపాల్ విమానాశ్రయంలో.. ఆ దేశానికే చెందిన టారా ఎయిర్‌లైన్ విమానం టైర్ పంక్చర్ అయింది. పైకి ఎగరలేని పరిస్థితి. కనీసం ముందుకు కూడా వెళ్లట్లేదు. విమానంలో ఎక్కినవారే.. ఆటో, బస్సును తోసినట్లు ముందుకు తోయాల్సి వచ్చింది.