తెలంగాణ

telangana

ETV Bharat / international

'కశ్మీర్​పై పాక్​ కుట్రలకు తగిన జవాబు' - ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో పాక్​-చైనాకు భంగపాటుపై ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్​ అక్బరుద్దీన్​ స్పందించారు. అసలు సమస్య నుంచి దృష్టి మరల్చేందుకు పాకిస్థాన్​ చేస్తున్న ప్రయత్నాలకు అడ్డుకట్టపడిందని తెలిపారు. ఇకనైనా ప్రవర్తన మార్చుకుని భారత్​తో సంబంధాలు మెరుగుపరుచుకునే విధంగా వ్యవహరించాలని హితవు పలికారు.

Pak's use of false pretences at UN has run its course: Akbaruddin
'కశ్మీర్​పై పాక్​ కుట్రలకు తగిన జవాబు'

By

Published : Jan 16, 2020, 1:23 PM IST

అసత్య ప్రచారాల ద్వారా అసలు సమస్య నుంచి దృష్టి మరల్చేందుకు పాకిస్థాన్​ చేసిన ప్రయత్నాలు మరోసారి విఫలమయ్యాయని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్​ అక్బరుద్దీన్​ విమర్శించారు. కశ్మీర్​ అంశంపై పాకిస్థాన్​, చైనాలకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భంగపాటు ఎదురైన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

'కశ్మీర్​పై పాక్​ కుట్రలకు తగిన జవాబు'

"ఈ సమావేశంలోని ఫలితాలు మేము ఉహించినవే. గందరగోళాన్ని సృష్టించాలన్న పాకిస్థాన్​ ప్రతినిధుల ప్రణాళికలు విఫలమవడం సంతోషకరం. కశ్మీర్​ అంశంపై ఐరాస వేదికగా వారు చేసిన ఆరోపణలు నిరాధారమైనవని మరోసారి రుజువైంది. ఈ సంకేతాలను దృష్టిలో పెట్టుకుని భారత్​తో సంబంధాలను మెరుగుపరుచుకునే విధంగా పాకిస్థాన్​ అడుగులు వేయాలని ఆశిస్తున్నాం."
- సయ్యద్​ అక్బరుద్దీన్​, ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి.

కశ్మీర్​ అంశంలో భారత్​పై అనేక ఆరోపణలు చేస్తూ పాకిస్థాన్​ విదేశాంగమంత్రి మహమూద్​​ ఖురేషీ ఐరాసకు లేఖ రాశారు. ఈ లేఖకు మద్దతు ప్రకటిస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సమావేశం నిర్వహించి చర్చకు పట్టుబట్టింది చైనా. కానీ చైనా ప్రతిపాదనను సభ్య దేశాలు తిరస్కరించాయి. సమస్యను ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకునే సామర్థ్యం భారత్​-పాక్​కు ఉందని ఇతర సభ్య దేశాలు తేల్చిచెప్పాయి. ఈ అంశంలో మండలి జోక్యం అనవసరమని స్పష్టం చేశాయి.

తన మిత్రదేశం పాక్​కు మద్దతుగా చైనా.. కశ్మీర్​ అంశాన్ని లేవనెత్తడం ఇది మూడోసారి. గత నెలలో ఐరాస రహస్య సమావేశంలో కశ్మీర్ గురించి చర్చించడానికి చైనా చేసిన ప్రయత్నాన్ని ఫ్రాన్స్, అమెరికా, బ్రిటన్‌, రష్యా నిలువరించాయి.

ఇదీ చూడండి:- గుడి దగ్గర మహిళ నగ్న మృతదేహం.. ఆమె తల ఎక్కడ?

ABOUT THE AUTHOR

...view details