తెలంగాణ

telangana

ETV Bharat / international

పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పాక్​ తీర్మానం

పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని పాక్​ పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలకు ఇది వ్యతిరేకమంటూ.. తక్షణమే ఈ చట్టాన్ని భారత్​ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్​ చేసింది.

pak parliament
పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పాక్​ తీర్మానం

By

Published : Dec 17, 2019, 5:32 AM IST

Updated : Dec 17, 2019, 12:27 PM IST

పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పాక్​ తీర్మానం

పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు మిన్నంటుతున్నాయి. తాజాగా ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పాక్ పార్లమెంట్​ ఏకగ్రీవంగా ఓ తీర్మానాన్ని ఆమోదించింది. ఆ దేశ విద్యాశాఖ మంత్రి షఫ్​కత్​ మహ్మూద్​ సోమవారం తీర్మానాన్ని ప్రవేశపెడుతూ.. భారత ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు పౌర చట్టం విరుద్ధమంటూ పేర్కొన్నారు. తక్షణమే ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని మోదీ సర్కారును డిమాండ్​ చేశారు.

"అంతర్జాతీయ మానవ హక్కుల చట్టం, పక్షపాతం, సమానత్వ నిబంధనలకు ఈ పౌరసత్వ సవరణ చట్టం విరుద్ధం. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలకు కూడా విరుద్ధమే. ముఖ్యంగా మైనారిటీల హక్కులు, భద్రతకు ఈ చట్టం భంగం కలిగిస్తుంది. పొరుగు దేశాల నుంచి వలస వచ్చిన మైనార్టీలకు రక్షణ కల్పించడానికి ఈ చట్టాన్ని ఆమోదించినట్లు చెబుతున్న భారత ప్రభుత్వం.. స్వదేశంలోని మైనార్టీల హక్కులను ఉల్లంఘిస్తున్నామన్న నిజాన్ని విస్మరిస్తోంది. "

-షఫ్​కత్​ మహ్మూద్​, పాక్​ విద్యాశాఖ మంత్రి.

హిందుత్వ భావజాలంతోనే..

పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ మోదీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు గుప్పించారు పాక్​ విదేశాంగ మంత్రి మహ్మద్​ ఖురేషీ. ముస్లిం విద్యార్థుల పట్ల భారత్​ ప్రభుత్వం కఠినంగా ప్రవర్తిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.

"మోదీ ప్రభుత్వం హిందుత్వ ఆధిపత్య భావజాలంతో మైనార్టీల హక్కులను కాలరాస్తోంది." .

-మహ్మద్​ ఖురేషీ, పాక్​ విదేశాంగ మంత్రి​.

ఇదీ చూడండి : సైకిల్ రేసులో శునకం షికారు... రైడర్లు బేజారు!

Last Updated : Dec 17, 2019, 12:27 PM IST

ABOUT THE AUTHOR

...view details