చైనాలో పుట్టిన కరోనా వైరస్.. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ముఖ్యంగా పాకిస్థాన్‌లో ఈ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. గత 24 గంటల్లో 1,581మంది వైరస్ బారిన పడగా.. మొత్తం బాధితుల సంఖ్య 38,799కు చేరుకుంది. మరో 31మంది మరణించడం వల్ల మృతుల సంఖ్య 834కు పెరిగింది. ఇప్పటివరకు 10,880మంది వైరస్ నుంచి కోలుకున్నారని పాక్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు.
పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోనూ...
పంజాబ్‌లో 14,201 మంది.. సింధ్‌లో 14,916, కైబర్-పఖ్తున్క్వాలో 10,880, బలుచిస్థాన్ 2,457, గిల్గిత్-బల్టిస్థాన్ 518, ఇస్లామాబాద్‌లో 921, పాక్ ఆక్రమిత కశ్మీర్లో 108 మంది కొవిడ్-19 బారిన పడ్డారని అధికారులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 359,264మందికి కరోనా పరీక్షలు జరిపినట్లు అధికారులు వెల్లడించారు.