జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దును మొదటినుంచీ వ్యతిరేకిస్తున్న పాకిస్థాన్.. ఈ అంశంపై ప్రపంచ దేశాల మద్దతు కోసం ప్రయత్నిస్తోంది. భారత ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా గళం విప్పాలని పలు దేశాధినేతలతో చర్చలు జరుపుతోంది. కశ్మీర్ అంశంపై తాజాగా ఇండోనేసియా అధ్యక్షుడితోనూ ఫోన్లో సంభాషించారు పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్. 370 అధికరణ రద్దుతో అమాయకులైన కశ్మీర్ ప్రజలు ప్రాణాలు కోల్పోయే ప్రమాదముందని జోకో విడోడోకు వివరించారు ఇమ్రాన్. కశ్మీర్ విషయంలో తమకు మద్దతుగా నిలవాలని కోరినట్లు సమాచారం.
కశ్మీర్‌పై ప్రపంచ దేశాల మద్దతుకు పాక్ యత్నాలు - ప్రపంచ దేశాలు
జమ్ముకశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దుకు వ్యతిరేకంగా ప్రపంచదేశాల మద్దతు కోసం ప్రయత్నిస్తోంది పాకిస్థాన్. ఇప్పటికే పలు దేశాధినేతలతో చర్చలు జరిపిన ఇమ్రాన్‌ఖాన్ తాజాగా ఇండేనేసియా అధ్యక్షుడితో సంప్రదింపులు జరిపారు.
ఇదే అంశంపై ఇంగ్లాండ్, మలేసియా ప్రధానులతో పాటు టర్కీ అధ్యక్షుడు, సౌదీ యువరాజుతో ఇప్పటికే సంప్రదింపులు జరిపారు పాక్ ప్రధాని. ఆర్టికల్ 370 రద్దుపై అభ్యంతరాలు లేవనెత్తిన పాకిస్థాన్ సర్కార్.. భారత్‌తో దౌత్య, వాణిజ్య సంబంధాలు తెగతెంపులు చేసుకునే దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పాక్‌లోని భారత హైకమిషనర్ అజయ్ బిసారియాను బహిష్కరించింది. సంఝౌతా ఎక్స్‌ప్రెస్ రద్దుతో పాటు భారత్‌కు పాక్ హైకమిషనర్ రాకుండా నిర్ణయం తీసుకుంది.
ఇదీ చూడండి:హాంగ్‌కాంగ్ హింసాయుతం- రవాణా బంద్!