తెలంగాణ

telangana

ETV Bharat / international

'కశ్మీర్'పై​ అంతర్జాతీయ న్యాయస్థానానికి పాక్​

కశ్మీర్​ అంశంలో అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని పాక్​ నిర్ణయించింది. ఈ విషయాన్ని పాక్​ విదేశాంగ మంత్రి షా మహ్మద్​ ఖురేషి ధ్రువీకరించారు.

కశ్మీర్​ అంశంలో అంతర్జాతీయ న్యాయస్థానానికి పాక్​

By

Published : Aug 21, 2019, 5:43 AM IST

Updated : Sep 27, 2019, 5:46 PM IST

ఆర్టికల్‌ 370 రద్దు నేపథ్యంలో కశ్మీర్‌ అంశంలో అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించనుంది పాకిస్థాన్​. ఈ విషయాన్ని ఆ దేశ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి మహమూద్ ఖురేషి స్పష్టం చేశారు. ఇప్పటికే ఐరాస భద్రతా మండలిలో చర్చకు ప్రయత్నించి చేతులు కాల్చుకుంది పొరుగుదేశం.

కశ్మీర్ అంశాన్ని ఐరాస భద్రతామండలి, అంతర్జాతీయ న్యాయస్థానం సహా అన్ని అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావిస్తామని ఆ దేశ పార్లమెంటులో పాక్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్ ప్రకటించారు.

ఐరాసలో చుక్కెదురు

అందులో భాగంగా ఐరాస భద్రతామండలిలో చర్చించాలని లేఖ రాయగా అందుకు చైనా మద్దతిచ్చింది. రహస్య సంప్రదింపులు జరిగినా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ భేటీలో ఒక్క చైనా మినహా అన్నిదేశాలు భారత్ వాదనకే మద్దతిచ్చాయి.

ఫలితంగా మిగిలిన ఏకైక ప్రపంచ వేదిక అయిన అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని పాకిస్థాన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి:ఇమ్రాన్​ దుందుడుకు మాటలు తగ్గించుకోండి: ట్రంప్​

Last Updated : Sep 27, 2019, 5:46 PM IST

ABOUT THE AUTHOR

...view details