పాక్ చెరలో ఉన్న భారత మాజీ నావికాదళ అధికారి కులభూషణ్ జాదవ్ తరపున న్యాయవాదిని నియమించుకోవాలంటూ దాయాది దేశం మరోసారి భారత్‌ను కోరింది. గూఢచర్యం ఆరోపణలతో జాదవ్‌కు పాక్ కోర్టు మరణశిక్ష విధించగా.. అంతర్జాతీయ న్యాయస్థానం ఆ శిక్షను నిలిపేసింది. దీంతో ఇస్లామాబాద్ హైకోర్టు ఈ కేసును పునఃవిచారణ జరుపుతోంది.
జాదవ్ తరపున న్యాయవాదిని నియమించేలా భారత్‌ను సంప్రదించాలని హైకోర్టు పాక్ సర్కారుకు సూచించింది. ఈమేరకు భారత్‌కు వర్తమానం పంపినట్టు అక్కడి విదేశాంగ కార్యాలయం పేర్కొంది.