గూఢచర్యం కేసులో పాకిస్థాన్ మరణశిక్ష విధించిన భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్(Kulbhushan Jadhav) శిక్షను అప్పీలు చేసుకునే హక్కుకు అవకాశం కల్పించే బిల్లును పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ ఆమోదించింది. 2020 అంతర్జాతీయ న్యాయస్ధానం-సమీక్ష, పునఃసమీక్ష పేరుతో రూపొందించిన ఈ బిల్లుకు ఆ దేశ ప్రభుత్వం మద్దతు ఉంది. ఈ బిల్లు ఆమోదం నేపథ్యంలో తన మరణశిక్షను సవాల్ చేసుకునేందుకు కుల్‌భూషణ్.. భారత ప్రభుత్వంతో దౌత్యపరమైన సంప్రదింపులు చేసుకునే వీలు కలుగుతుంది.
ఆ న్యాయస్థానం ఆదేశాలతో...
గూఢచర్యం, ఉగ్రవాదం ఆరోపణలపై కుల్‌భూషణ్‌కు 2017లో పాకిస్థాన్ మరణశిక్ష విధించింది. శిక్షను అపీల్ చేసుకునేందుకు వీలుగా ఆయనకు దౌత్యపరమైన సంప్రదింపులకు అవకాశం కల్పించకపోవడంపై అంతర్జాతీయ న్యాయస్ధాన్ని భారత్ ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్ధానం.. కుల్‌భూషణ్ మరణశిక్షను పునఃసమీక్షించడం సహా అపీల్‌కు వీలుగా భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపేందుకు సత్వరమే చర్యలు తీసుకోవాలని 2019లో పాక్‌ను ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే పాక్ జాతీయ అసెంబ్లీ సంబంధిత బిల్లును ఆమోదించింది.
ఇదీ చూడండి:జాదవ్ కేసు విచారణకు సహకరించండి: పాక్ కోర్టు
ఇదీ చూడండి:'జాదవ్‌కు న్యాయవాదిని నియమించుకోండి'