పాకిస్థాన్లో సోమవారం రైళ్లు ఢీ కొన్న ప్రమాదంలో మృతుల సంఖ్య 65కు పెరిగింది. మరో 100 మందికి పైగా గాయపడ్డారు. కాగ, ఈ ప్రమాదానికి గల కారణాలపై తక్షణమే దర్యాప్తు జరిపించాలని అక్కడి ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.
ఎలా జరిగింది?
సోమవారం ఉదయం కరాచీ నుంచి సర్గోధాకు వెళ్తున్న మిల్లత్ ఎక్స్ప్రెస్.. ధార్కి వద్ద పట్టాలు తప్పింది. దీంతో ఎదురుగా వస్తున్న సర్ సయద్ ఎక్స్ప్రెస్.. మిల్లత్ రైలును ఢీకొట్టింది. ప్రమాదంలో మహిళలు, రైల్వే అధికారులు సైతం మరణించారు. చాలా బోగీలు ధ్వంసమయ్యాయి. సహాయక చర్యల కోసం ఆర్మీని రంగంలోకి దింపింది పాక్ ప్రభుత్వం.