జమాత్ ఉద్ దవా ఉగ్ర సంస్థ అధినేత హఫీజ్ సయీద్‌కు భారీ షాక్ ఇచ్చింది పాకిస్థాన్ కోర్టు. మరో కేసులో అతనికి 15 ఏళ్ల జైలు శిక్షను పాక్ ఉగ్రవాద నిరోధక కోర్టు ఖరారు చేసింది. అంతే కాకుండా రూ. 2లక్షల జరిమానా విధించింది.
హఫీజ్ సయీద్‌కు మరో భారీ షాక్ - ఉగ్రదాడులు
ముంబయి ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌కు పాక్ కోర్టు మరో షాకిచ్చింది. మరో కేసులో 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
హఫీజ్ సయీద్‌కు మరో భారీ షాక్
ఇప్పటికే నాలుగు కేసుల్లో హఫీజ్ దోషిగా తేలాడు. అందుకు 21 ఏళ్ల శిక్ష కూడా పడింది. తాజా కేసులో దోషి గా తేలడం వల్ల మొత్తం 5 కేసుల్లో శిక్షపడినట్లయింది. అన్ని కేసులలో కలుపి అతనికి మొత్తం 36 ఏళ్ల జైలు శిక్ష పడింది.