పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సహా మరో ముగ్గురిపై కొత్తగా అవినీతి కేసు నమోదు చేసింది అక్కడి అవినీతి నిరోదక సంస్థ. 34ఏళ్ల క్రితం నాటి అక్రమ భూ కేటాయింపుల కేసులో సంబంధమున్నందుకు ఈ మేరకు చర్యలు చెేపట్టింది. అరెస్టు చేసేందుకు వారెంట్ జారీ చేసింది.
షరీఫ్ ప్రస్తుతం లండన్‌లో ఉన్నారు. చికిత్స నిమిత్తం అక్కడకు వెళ్లేందుకు నవంబరులో లాహోర్ కోర్టు అనుమతిచ్చింది.
పనామా పేపర్స్ కేసులో నవాజ్ షరీఫ్‌ను ప్రధాని పదవి నుంచి తొలగిస్తూ 2017 నవంబరులో తీర్పునిచ్చింది పాక్ సుప్రీంకోర్టు. అప్పటి ఆయనపై పలు కేసులు నమోదు చేసింది ప్రస్తుత ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం.
పాక్‌లోని పంజాబ్ రాష్ట్రంలో 34 ఏళ్ల క్రితం నాటి అక్రమ భూ కేటాయింపుల కేసులో పలుమార్లు సమన్లు జారీ చేసినా నవాజ్ నుంచి ఎలాంటి స్పందన రాలేదని అవినీతి నిరోదక కోర్టును తాజాగా ఆశ్రయించింది పాక్ నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో(న్యాబ్). నవాజ్‌ను నేరస్థుడిగా ప్రకటించాలని కోరింది. ఈ కేసుతో సంబంధమున్న మరో ముగ్గురిపైనా అభియోగాలు మోపింది.
1986 నాటి కేసు..