తెలంగాణ

telangana

ETV Bharat / international

ట్రక్కు లక్ష్యంగా దాడి- 11 మంది మృతి - ట్రక్కు లక్ష్యంగా దాడి

పాకిస్థాన్​లో ట్రక్కు లక్ష్యంగా జరిగిన దాడిలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మంది గాయపడ్డారు. మృతుల్లో ఆరుగురు మహిళలు, నలుగురు చిన్నారులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

attackers target truck in Karachi
ట్రక్కు లక్ష్యంగా దాడి

By

Published : Aug 15, 2021, 1:38 AM IST

Updated : Aug 15, 2021, 4:58 AM IST

పాకిస్థాన్​ కరాచీలో ట్రక్కును లక్ష్యంగా చేసుకుని దుండగులు చేసిన దాడిలో 11 మంది మరణించారు. మృతుల్లో ఆరుగురు మహిళలు, నలుగురు పిల్లలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. శనివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో మరో 12 మంది గాయపడ్డారు.

వివాహ వేడుక నుంచి తిరిగి వెళ్తుండగా..

వారంతా వివాహ వేడుకకు హాజరై తిరిగి వెళ్తుండగా.. ఈ ఘటన జరిగినట్లు ఓ సీనియర్​ పోలీసు అధికారి పేర్కొన్నారు. దాడి సమయంలో మహిళలు, పిల్లలు సహా 20 నుంచి 25 మంది ట్రక్కులో ఉన్నట్లు తెలిపారు. ట్రక్కు అనుసరించి దుండగులు.. గ్రనేడ్​ విసిరి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు.

అయితే ఈ దాడి ఎవరు చేశారన్నది ఇంకా తెలియరాలేదు.

ఇదీ చూడండి:హైతీలో భారీ భూకంపం.. 29 మంది మృతి!

Last Updated : Aug 15, 2021, 4:58 AM IST

ABOUT THE AUTHOR

...view details