తెలంగాణ

telangana

ETV Bharat / international

పీఓకే ప్రజల హక్కులు కాపాడతాం: ఇమ్రాన్​ - ఇమ్రాన్​ ఖాన్​

కశ్మీర్​ స్వయం ప్రతిపత్తిని కాపాడితే భారత్​తో చర్చలకు సిద్ధమని పాకిస్థాన్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ అన్నారు. పాక్​ ఆక్రమిత కశ్మీర్​ (పీఓకే) ప్రజల హక్కులను పాకిస్థాన్ కాపాడుతుందని స్పష్టం చేశారు. ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా పీఓకే ప్రజలు స్వతంత్ర్యంగా ఉండడానికైనా లేదా తమ దేశంలో కలవడానికైనా అంగీకరిస్తామని పేర్కొన్నారు.

Pakistani PM urges Kashmir referendum, talks with India
'పీఓకే ప్రజల హక్కులు కాపాడతాం'

By

Published : Feb 6, 2021, 5:31 PM IST

పాక్​ ఆక్రమిత కశ్మీర్​ ప్రజల హక్కులను పాకిస్థాన్​ కాపాడుతుందని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ చెప్పారు. ప్రజాభిప్రాయసేకరణ ద్వారా పాక్​ ఆక్రమిత కాశ్మీర్​ ప్రజలు స్వతంత్ర్యంగా ఉండడానికైనా లేదా తమ దేశంలో కలవడానికైనా పాకిస్థాన్​ అనుమతిస్తుందని పేర్కొన్నారు. పాక్​ ఆక్రమిత కశ్మీర్​ సంఘీభావ దినోత్సవ సందర్భంగా కోట్లీ పట్టణంలో నిర్వహించిన ర్యాలీలో ఈ మేరకు స్పష్టం చేశారు.

మోదీతో చర్చలకు సిద్ధం...

2019లో కశ్మీర్​ స్వయం ప్రతిపత్తిని మార్చేవిధంగా భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు వెనక్కి తీసుకుంటే ప్రధాని నరేంద్ర మోదీతో చర్చలకు సిద్ధమని ఖాన్​ స్పష్టం చేశారు. 2019లో కశ్మీర్​ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా భారత ప్రభుత్వం విభజించింది. అప్పటినుంచి భారత్​, పాకిస్థాన్​ మధ్య వివాదం తీవ్రతరమైంది. భారత్​తో చర్చలు జరపబోమని పాక్​ స్పష్టం చేసింది.

ఇదీ చదవండి:'భారత్​-చైనా చర్చల్లో ఆశించిన పురోగతి లేదు'

ABOUT THE AUTHOR

...view details