తెలంగాణ

telangana

ETV Bharat / international

'కశ్మీర్'​పై పాక్​ విలేకర్ల అత్యుత్సాహం.. ట్రంప్​ పంచ్​..! - ఇమ్రాన్​ ఖాన్.

మీడియాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ అయిష్టత అందరికీ తెలిసిందే. గతంలో బాహాటంగానే ఎన్నోసార్లు విలేకర్లపై మండిపడ్డారు ట్రంప్​. తాజాగా మరోసారి అదే పునరావృతమైంది. ఈసారి పాక్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​తో సంయుక్త మీడియా సమావేశం ఇందుకు వేదికైంది.

'కశ్మీర్'​పై పాక్​ విలేకర్ల అత్యుత్సాహం.. ట్రంప్​ పంచ్​..!

By

Published : Sep 24, 2019, 9:33 PM IST

Updated : Oct 1, 2019, 9:27 PM IST

మీడియాపై ఎన్నోసార్లు బహిరంగంగానే ఆగ్రహాన్ని ప్రదర్శించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​.. మరోసారి అదే విధంగా ప్రవర్తించారు. అయితే.. ఈ సారి ట్రంప్​ కోపానికి గురైంది పాకిస్థానీ విలేకరులు. కశ్మీర్​ అంశంపై స్పందించాలని ట్రంప్​పై పదే పదే ఒత్తిడి చేసిన నేపథ్యంలో... 'ఇలాంటి రిపోర్టర్లను ఎక్కడినుంచి పట్టుకొస్తారు' అని పాక్​ ప్రధాని ఇమ్రాన్​తో చమత్కరించారు డొనాల్డ్​.

ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల్లో భాగంగా... ట్రంప్​, ఇమ్రాన్​లు సోమవారం సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలు, కశ్మీర్​ సమస్య, అఫ్గాన్​లో శాంతి అంశాలపై చర్చించారు. అనంతరం జరిగిన సంయుక్త మీడియా సమావేశంలో... జమ్ము ప్రత్యేక ప్రతిపత్తి రద్దుతో లోయలో నెలకొన్న పరిస్థితులపై పాక్​ విలేకరులు ట్రంప్​పై ప్రశ్నల వర్షం కురిపించారు.

కశ్మీర్​ పరిస్థితులపై అడిగిన ఓ పాకిస్థానీ విలేకరిని ట్రంప్​ ఎగతాళి చేశారు​. నువ్వేమైనా.. ఖాన్​ బృందంలో సభ్యునివా..? అంటూ ఎదురు ప్రశ్న వేశారు.

''నువ్వు ఆయన (ఇమ్రాన్​ఖాన్​) బృందంలో సభ్యునివా..? నువ్వు అడిగినవి ప్రశ్నల్లా లేవు. నువ్వే స్వయంగా ప్రకటన చేస్తున్నట్టుంది.''
- డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు.

ఆ తర్వాత కూడా.. పాక్​ జర్నలిస్ట్​ మరోసారి ట్రంప్​పై ఒత్తిడి తెచ్చారు. కశ్మీర్​లో మానవ హక్కుల ఉల్లంఘన అంశంపై ప్రశ్నించగా.. డొనాల్డ్​ ఇమ్రాన్​వైపు తిరిగి.. 'ఇలాంటి రిపోర్టర్లను ఎక్కడి నుంచి తీసుకొస్తారు' అని అడిగారు.

నకిలీ వార్తలు సృష్టిస్తున్నారని ట్రంప్​ గతంలోనూ పలుమార్లు మీడియాపై ఆగ్రహావేశాలు ప్రదర్శించారు. సెప్టెంబర్​ 2న మీడియాను ఉద్దేశిస్తూ ఫేక్​ న్యూస్​ను సృష్టించే సంస్థలు తన ప్రధాన శత్రువులని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:విదేశీ విద్యార్థులు మెచ్చిన రాష్ట్రం ఏదో తెలుసా..?

Last Updated : Oct 1, 2019, 9:27 PM IST

ABOUT THE AUTHOR

...view details