తెలంగాణ

telangana

ETV Bharat / international

ముగ్గురు లష్కరే ఉగ్రవాదులకు పాక్​ జైలు శిక్ష - court sentences three on terror

ఉగ్రవాదులకు నిధుల సమీకరణ నేరాల్లో దోషులుగా తేలిన ముగ్గురికి జైలు శిక్ష విధించింది పాకిస్థాన్​. ఇద్దరికి ఐదేళ్లు, ఒకరికి 18 నెలలుగా శిక్ష ఖరారు చేసింది లాహోర్​ కోర్టు. అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఉగ్రమూకలపై చర్యలకు పూనుకుంటోంది.

terror financing charges
ముగ్గురు లష్కరే ఉగ్రవాదులకు జైలు శిక్ష విధించిన పాక్​

By

Published : Aug 29, 2020, 1:36 PM IST

ఫైనాన్షియల్​ యాక్షన్​ టాస్క్​ఫోర్స్​ (ఎఫ్​ఏటీఎఫ్​) గ్రే లిస్ట్​ నుంచి బయటపడేందుకు తప్పని పరిస్థితుల్లో ఉగ్రవాదులపై చర్యలు చేపడుతోంది పాకిస్థాన్​. ఇప్పటికే దావూద్​ ఇబ్రహీంను ఉగ్రజాబితాలో చేర్చిన పాక్​ తాజాగా.. లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్​ సయీద్​ సన్నిహితుల్లో ముగ్గురిపై చర్యలు తీసుకుంది.

ముగ్గురిని ఉగ్రవాద నిధుల సమీకరణ నేరాల్లో దోషులగా తేల్చింది లాహోర్​ హైకోర్టు. ముగ్గురిలో మలిక్​ జాఫర్​ ఇక్బాల్​, అబ్దుల్​ సలాం భట్వీలకు ఐదేళ్ల జైలు శిక్ష, మూడో ఉగ్రవాది అద్దుల్​ రెహ్మాన్​ మక్కీకి 18 నెలల శిక్ష ఖరారు చేసింది. ఈ మేరకు పాకిస్థాన్​ తీవ్రవాద నిర్మూలన విభాగం వివరాలు వెల్లడించింది. ఈ ముగ్గురు ఉగ్రవాదులు సయీద్​ ఛారిటీ సంస్థలైన జమాత్​ ఉద్​ దవా, ఫలాహ్​ ఈ ఇన్​సానియత్​లకు నిధులు సమకూర్చుతున్నారని తేలినట్లు వివరించింది.

ఉగ్రవాదానికి ఆర్థిక సాయం కేసులో దోషిగా తేలిన తర్వాత.. హఫీజ్​ సయీద్​ ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. సయీద్​కు ఐదున్నరేళ్ల జైలు శిక్ష పడింది.

ఇదీ చూడండి: ఉగ్రవాదులపై పాక్ కొరడా- 88 సంస్థలపై కఠిన ఆంక్షలు

ABOUT THE AUTHOR

...view details