తెలంగాణ

telangana

By

Published : Oct 23, 2021, 10:50 PM IST

ETV Bharat / international

పాక్​ సీరియళ్లలో ఇక ఆ సీన్లు కట్​

టీవీ ఛానెళ్లలో 'కౌగిలింత దృశ్యాలను' నిషేధించాలని పాకిస్థాన్ ప్రభుత్వం నిర్ణయించింది. వివాహేతర సంబంధాలు, అసభ్యకరమైన సన్నివేశాలనూ ప్రసారం చేయకూడదని ఆదేశించింది.

serials
సీరియళ్లు

సీరియళ్లలో కౌగిలింతలు, ఇతరత్రా సన్నిహిత దృశ్యాలను ప్రసారం చేయడాన్ని నిలిపేయాలని పాకిస్థాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ(పీఈఎంఆర్‌ఏ) టీవీ ఛానళ్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈ తరహా కంటెంట్‌పై పౌరుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ కార్యక్రమాలు పాకిస్థాన్ సమాజపు అసలైన సంస్కృతిని ప్రతిబింబించడం లేదని వివరించింది.

ముందుగా సమీక్షించాల్సిందే..

సీరియళ్లలో వివాహేతర సంబంధాలు, అసభ్యకరమైన దృశ్యాలు, కౌగిలింతలు, పడక సన్నివేశాలు, జంటల మధ్య సాన్నిహిత్యం తదితరమైనవి ఇస్లామిక్ బోధనలు, దేశ సంస్కృతిని పూర్తిగా విస్మరిస్తున్నాయని పీఈఎంఆర్‌ఏ ఆరోపించింది. ఈ నేపథ్యంలో అన్ని టీవీ ఛానళ్లు తమ సీరియళ్ల కంటెంట్‌ను ముందుగా అంతర్గత పర్యవేక్షణ కమిటీ ద్వారా పూర్తిస్థాయిలో సమీక్షించాలని, సంబంధిత దృశ్యాలను కత్తిరించాలని ఆదేశించింది. శాటిలైట్ టీవీ లైసెన్సుదారులందరూ పీఈఎంఆర్‌ఏ నియమ నిబంధనలను పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. మరోవైపు ఈ నిర్ణయంపై మిశ్రమ స్పందన వస్తోంది. పరువు హత్యలు, మహిళలపై వేధింపులు తదితర అంశాలను పట్టించుకోని కొంతమంది స్పందనను పీఈఎంఆర్‌ఏ పరిగణనలోకి తీసుకుందని విమర్శిస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details