ఇప్పటికే తీవ్రమైన ఆర్థిక సమస్యలతో అల్లాడుతున్న పాకిస్థాన్‌కు అంతర్జాతీయ ఆర్థిక సాయం పొందే విషయంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఉగ్రవాదులకు ఆర్థిక సహకారం, మనీలాండరింగ్ నేరాలకు పాల్పడుతుందనే కారణంతో పాకిస్థాన్‌ను గ్రే జాబితాలో చేర్చిన ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ (ఎఫ్‌ఏటీఎఫ్).. పాక్‌ను అదే స్థానంలో కొనసాగించాలని నిర్ణయించింది. శుక్రవారంతో ముగిసిన టాస్క్‌ఫోర్స్ సమావేశాల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
పాకిస్థాన్‌కు ఎదురుదెబ్బ- మళ్లీ గ్రే జాబితాలోనే - పాకిస్థాన్ తాజా వార్తలు
![పాకిస్థాన్‌కు ఎదురుదెబ్బ- మళ్లీ గ్రే జాబితాలోనే Pakistan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9288233-495-9288233-1603462308046.jpg)
19:48 October 23
తాము సూచించిన 27 సూత్రాల కార్యాచరణను పాటించిందా లేదా అన్న అంశం సమీక్షించిన ఎఫ్‌ఏటీఎఫ్.. పాకిస్థాన్‌ను గ్రే జాబితాలో కొనసాగించేందుకే మొగ్గు చూపింది. ఎఫ్‌ఏటీఎఫ్.. పాకిస్థాన్‌ను 2018 జూన్‌లో గ్రే జాబితాలో చేర్చింది. ఈ టాస్క్‌ఫోర్స్ గ్రే జాబితాలో ఉండే దేశాలకు ప్రపంచ బ్యాంకు సహా వివిధ అంతర్జాతీయ సంస్ధల నుంచి ఆర్థిక సాయం పొందడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. గ్రే జాబితా నుంచి బయటపడేందుకు ఈ ఏడాది ఆగస్టులో జైషే మహ్మద్, జమాతే దువా సహా 88 నిషేధిత ఉగ్రవాద సంస్ధలపై పాకిస్థాన్ ఆర్థిక ఆంక్షలను విధించింది. అయినా ఎఫ్‌ఏటీఎఫ్ సంతృప్తి చెందలేదు.
19:24 October 23
పాకిస్థాన్‌కు ఎదురుదెబ్బ- మళ్లీ గ్రే జాబితాలోనే
- పాకిస్థాన్‌ను గ్రే జాబితాలో కొనసాగిస్తున్నట్లు ఎఫ్‌ఏటీఎఫ్ వెల్లడి
- 2018 జూన్‌లో పాకిస్థాన్‌ను గ్రే జాబితాలో చేర్చిన ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్
- 2021 జూన్ వరకు పాకిస్థాన్ గ్రే జాబితాలోనే ఉండే అవకాశం
- పాకిస్థాన్‌కు అంతర్జాతీయ ఆర్థిక సాయం పొందే విషయంలో గట్టి ఎదురుదెబ్బ
- ఉగ్రవాదులకు ఆర్థిక సహకారం అందిస్తున్నట్లు పాకిస్థాన్‌పై ఆరోపణలు
- మనీలాండరింగ్ నేరాలకు పాల్పడుతున్నారని పాకిస్థాన్‌పై ఆరోపణలు