తెలంగాణ

telangana

ETV Bharat / international

2020 ఫిబ్రవరి వరకు గ్రే లిస్టులోనే పాక్​! - అంతర్జాతీయ వార్తలు

2020 ఫిబ్రవరి వరకు పాకిస్థాన్​ను గ్రే లిస్టులోనే కొనసాగించాలని ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ ఫోర్స్‌ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఎఫ్​ఏటీఎఫ్​ వార్షిక సమావేశాల్లో భాగంగా పాక్​పై తీసుకున్న చర్యలపై ఈ నెల 18న ప్రకటన చేసే అవకాశం ఉంది.

2020 ఫిబ్రవరి వరకు గ్రే లిస్టులోనే పాక్​

By

Published : Oct 16, 2019, 6:02 PM IST

ఉగ్రసంస్థలకు నిధులు సమకూరుస్తున్న పాకిస్థాన్​కు మరోసారి ఆర్థిక నేరాల నియంత్రణ సంస్థ (ఎఫ్​ఏటీఎఫ్​)లో చుక్కెదురైంది. 2020 ఫిబ్రవరి వరకు గ్రే లిస్టులోనే కొనసాగించాలని సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

ఉగ్రసంస్థలకు నిధుల అందించడాన్ని పూర్తిగా ఆపివేయడానికి మరిన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా పాక్‌ను ఎఫ్​ఏటీఎఫ్​ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఎఫ్​ఏటీఎఫ్​లో పాక్‌ స్థానంపై ఆ సంస్థ 2020 ఫిబ్రవరి కల్లా తుది నిర్ణయం తీసుకోనునే అవకాశం ఉంది.

18న ప్రకటన!

పారిస్‌లో ఈ నెల 13న ప్రారంభమైన ఎఫ్​ఏటీఎఫ్​ వార్షిక సమావేశాలు ఈనెల 18 వరకు జరగనున్నాయి. ఈ సమావేశాల చివరి రోజైన శుక్రవారం పాక్ అంశంపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

బ్లాక్​ లిస్టులో చేర్చాలని..

స్తంభింపజేసిన ఖాతాల నుంచి నిధులు ఉపసంహరించుకునేలా ఉగ్రవాది హఫీజ్‌ సయీద్‌కు పాక్‌ అనుమతినిచ్చిందని భారత్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశాన్ని పేర్కొంటూ పాక్‌ను బ్లాక్‌లిస్టులో ఉంచాలని ఎఫ్​ఏటీఎఫ్​కు సిఫార్సు చేసింది.

పాక్​కు కష్టమే..

గతేడాది జూన్​లో పాక్​ను 'గ్రే లిస్ట్​'లో చేర్చి 2019 అక్టోబర్​ నాటికి తమ మార్గదర్శకాలను అమలు చేయాలని సూచించింది ఎఫ్​ఏటీఎఫ్. సంస్థ సూచించిన 27 మార్గదర్శకాల్లో కేవలం ఆరింటిని మాత్రమే పూర్తి చేసింది. డార్క్​ గ్రే జాబితాపైనా దృష్టి సారించే అవకాశం ఉంది.

గ్రే లిస్టులోనే కొనసాగినా.. డార్క్​ గ్రే జాబితాలో చేర్చినా ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న పాక్​కు మరింత కష్టమవుతుంది. పాక్​పై ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్, ఐరోపా సమాఖ్యలు ఆర్థిక సహాయం అందించడంపై మరింత కఠిన నిబంధనలు విధించే అవకాశం ఉంది.

ABOUT THE AUTHOR

...view details