చైనాకు చెందిన ప్రముఖ వీడియో యాప్ టిక్‌టాక్‌పై పాకిస్థాన్ నిషేధం విధించింది. అనైతిక, అసభ్యకర కంటెంట్‌కు వ్యతిరేకంగా వివిధ వర్గాల నుంచి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టెలీకమ్యూనికేషన్ శాఖ తెలిపింది.
చైనాకు పాకిస్థాన్ షాక్- టిక్‌టాక్‌పై నిషేధం
చైనాకు మిత్రదేశం పాకిస్థాన్ షాకిచ్చింది. ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్‌పై నిషేధం విధించింది. ఈ యాప్‌లో అనైతిక, అసభ్యకర సమాచారానికి వ్యతిరేకంగా ఫిర్యాదులు అందటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాక్ స్పష్టం చేసింది.
పాకిస్థాన్
టిక్‌టాక్‌లో వస్తున్న కంటెంట్‌కు సంబంధించి సంస్థకు చివరి నోటీసులు జారీ చేశామని, వారు స్పందించేందుకు కావాల్సిన సమయం ఇచ్చినట్లు తెలిపింది. అయితే, ఆ సంస్థ పూర్తి నిబంధనలు పాటించటంలో విఫలమైన కారణంగా దేశంలో నిషేధం విధించామని ఓ ప్రకటనలో తెలిపింది.
ఇదీ చూడండి:ఐరాసలో పాక్ ప్రయత్నాలకు భారత్ బ్రేకులు