జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు నేపథ్యంలో భారత్‌తో ద్వైపాక్షిక బంధాన్ని తెంచే దిశలో చర్యలు ముమ్మరం చేసింది పాకిస్థాన్. ఇప్పటికే రెండు సరిహద్దు రైళ్లను నిలిపివేసిన పాక్... తాజాగా దిల్లీ-లాహోర్ ఫ్రెండ్షిప్ బస్సు సర్వీసును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి ఈ బస్సు సర్వీసు పూర్తిగా నిలిచిపోనుంది.
"జాతీయ భద్రతాకమిటీ (ఎన్ఎస్సీ) నిర్ణయం ప్రకారం భారత్-పాక్ మధ్య నడిచే బస్సు సర్వీసులను సోమవారం నుంచి నిలిపివేస్తున్నాం."
- మురద్ సయీద్, పాక్ కమ్యునికేషన్స్, పోస్టల్ సర్వీసెస్ మంత్రి ట్వీట్
1999 ఫిబ్రవరిలో దిల్లీ-లాహోర్ మధ్య ఫ్రెండ్షిప్ బస్సు సర్వీసు ప్రారంభమైంది. 2001 పార్లమెంట్‌పై ఉగ్రవాదుల దాడి అనంతరం దానిని నిలిపివేశారు. 2003 జులైలో ఈ బస్సు సర్వీసు పునరుద్ధరించారు.