తెలంగాణ

telangana

ETV Bharat / international

కశ్మీర్‌ సమస్యపై పాకిస్థాన్‌ నిరసన - pak summons indian charge

కశ్మీర్ సమస్యపై పాకిస్థాన్ నిరసన వ్యక్తం చేసింది. కశ్మీర్ విభజనను ఉపసంహరించుకోవాలని భారత దౌత్యవేత్తను పిలిపించి డిమాండ్ చేసింది. బలమైన నిరసన తెలియజేయడానికే దౌత్యవేత్తను పిలిచినట్లు తెలిపింది.

pakistan-summons-indian-charg-d-affaires-over-kashmir-issue
కశ్మీర్‌ సమస్యపై పాకిస్థాన్‌ నిరసన

By

Published : Oct 28, 2020, 5:48 AM IST

Updated : Oct 28, 2020, 7:03 AM IST

కశ్మీర్‌ సమస్యపై పాకిస్థాన్‌ మంగళవారం ఇండియన్‌ ఛార్జ్‌ డి ఎఫైర్స్‌ను పిలిపించి నిరసన తెలిపింది. 'కశ్మీర్‌ బ్లాక్‌ డే' సందర్భంగా బలమైన నిరసన నమోదు చేయడానికి భారత దౌత్యవేత్తను పిలిచినట్లు పాక్‌ విదేశాంగ కార్యాలయం తెలిపింది. ప్రత్యేక హోదాను ఉపసంహరించుకుని.. జమ్ము-కశ్మీర్‌, లద్దాఖ్‌ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించే ఏకపక్ష చర్యను భారత్‌ రద్దు చేసుకోవాలని ఈ సందర్భంగా పాక్‌ డిమాండ్‌ చేసింది.

గతేడాది ఆగస్టు 5న అధికరణం-370 రద్దుపై భారత్‌కు వ్యతిరేకంగా అంతర్జాతీయ మద్దతును కూడగట్టడంలో పాకిస్థాన్‌ విఫలమైంది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 370ను రద్దు చేయడం భారత అంతర్గత విషయమని అంతర్జాతీయ సమాజం పాక్‌కు స్పష్టం చేసింది.

Last Updated : Oct 28, 2020, 7:03 AM IST

ABOUT THE AUTHOR

...view details