రెండు ఆపరేషన్లలో.. 8మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు పాకిస్థాన్ ప్రకటించింది. ఒకప్పుడు.. తాలిబన్ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ఉత్తర వాజిరిస్తాన్ ప్రాంతంలోని మిలిటెంట్ల స్థావరాలపై ఈ నిఘా ఆధారిత ఆపరేషన్లు నిర్వహించినట్టు పేర్కొంది.
బోయా, దొశాలి ప్రాంతాల్లో ఆపరేషన్లు జరిగాయని.. ఇందులో ముగ్గురు పాకిస్థానీ తాలిబన్ కమాండర్లను మట్టుబెట్టినట్లు సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. వీరు గతంలో భద్రతా దళాలు, పౌరులపై ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినట్లు తెలిపింది.