తెలంగాణ

telangana

ETV Bharat / international

'జాదవ్​ కేసులో భారత్​తో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదు' - జాదవ్​ కేసులో పాక్​ రాజ్యాంగాన్నే అనుసరిస్తామని పాక్ ప్రకటన

కుల్​భూషణ్ జాదవ్​ విషయంలో భారత్​తో తాము ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని పాకిస్థాన్​ ప్రకటించింది. జాదవ్​ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పును అమలుచేసేందుకు.. ఏ నిర్ణయం తీసుకున్నా అది పాక్ రాజ్యాంగానికి లోబడి మాత్రమే ఉంటుందని వెల్లడించింది.

'జాదవ్​ కేసులో భారత్​తో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదు'

By

Published : Nov 14, 2019, 9:36 PM IST

భారత నౌకాదళ విశ్రాంత అధికారి కుల్​భూషణ్​ జాదవ్​ కేసుకు సంబంధించి భారత్​తో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని పాక్ విదేశాంగశాఖ వెల్లడించింది. జాదవ్​ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు అమలుచేసేందుకు చేపట్టే ఏ చర్య అయినా... అది పాక్ రాజ్యాంగానికి లోబడి మాత్రమే ఉంటుందని స్పష్టం చేసింది.

జాదవ్​ కేసును సమీక్షించేందుకు చట్టపరమైన అవకాశాలను పరిశీలిస్తున్నట్లు పాక్ సైన్యం ప్రకటించిన మరుసటి రోజే.. ఆ దేశ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి మహ్మద్ ఫైజల్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

సమీక్షించండి..

ఉగ్రవాదం, గూఢచర్యం ఆరోపణలపై పాక్ సైనికన్యాయస్థానం కుల్​భూషణ్​ జాదవ్​కు ఉరిశిక్ష విధించింది. దీనిని వ్యతిరేకిస్తూ భారత్​ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఫలితంగా జాదవ్​ మరణశిక్షను సమీక్షించాలని అంతర్జాతీయ న్యాయస్థానం జులై 17న వెలువరించిన తన తీర్పులో.. పాకిస్థాన్​కు సూచించింది.

ఇదీ చూడండి: భారత జీడీపీ వృద్ధి రేటు మరోసారి తగ్గించిన మూడీస్​

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details