బాస్మతి బియ్యం భౌగోళిక గుర్తింపు (జీఐ) కోసం ఐరోపా సమాఖ్యకు దరఖాస్తు చేసుకుంది భారత్. భారత ఉపఖండంలో పండే పొడువైన బాస్మతి బియ్యం సుగంధ భరితమైనవని. ఇవి భారత ఉప ఖండంలోని ప్రత్యేక భౌగోళిక ప్రాంతమైన హిమాలయాల పర్వతాల కింద సింధూ-గంగా మైదాన భూభాగంలో ఎక్కువగా పండుతాయని దరఖాస్తులో పేర్కొంది భారత్.
ప్రత్యేకమైన బాస్మతి బియ్యం... పంజాబ్, హరియాణా, దిల్లీ, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్టాల్లోని అన్ని జిల్లాల్లోనూ, ఉత్తర్‌ప్రదేశ్, జమ్ముకశ్మీర్‌లోని కొన్నిజిల్లాల్లో పండుతాయని నివేదించింది భారత్.
పాక్ కుట్రలు
ఒకవేళ భారత్ బాస్మతి బియ్యానికి జీఐ లభించినట్లయితే, తమ దేశ బియ్యం ఎగుమతులు దెబ్బతింటాయని భావించిన పాక్... ఈయూలో భారత్ దరఖాస్తును వ్యతిరేకించాలని కుట్ర పన్నుతోంది. ఈ మేరకు ఆ దేశంలోని ప్రముఖ బియ్యం ఎగుమతుదారులు భారత్ దరఖాస్తును తక్షణమే వ్యతిరేకించాలని ప్రభుత్వాన్ని కోరారు. లేకపోతే దేశంలోని బియ్యం ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు ఆ దేశ బియ్యం ఎగుమతి అసోసియేషన్ అధికారి తారిక్ అహ్మద్.