కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో పాకిస్థాన్ సర్కార్ మంగళవారం విద్యాలయాలను పునః ప్రారంభించింది. తొలి దఫాలో భాగంగా ఉన్నత పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలను తిరిగి తెరిచింది.
ఆరవ తరగతి నుంచి ఎనిమిదవ తరగతి విద్యార్థులకు సెప్టెంబర్ 23 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. ప్రాథమిక పాఠశాలలు సెప్టెంబర్ 30 నుంచి మొదలుకానున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా దాదాపు 5 నెలల తర్వాత పాఠశాలలు తెరుచుకున్నాయి.
నిబంధనలు...
- ఆరోగ్యశాఖ నిబంధనల ప్రకారం తరగతి గదిలో కేవలం 20 మంది విద్యార్థులనే అనుమతిస్తున్నారు.
- విద్యార్థులను రెండు బృందాలుగా విభజించి ప్రత్యామ్నాయ రోజుల్లో పాఠశాలకు వచ్చేలా ప్రణాళిక సిద్ధం చేశారు.
- విద్యార్థులు, ఉపాధ్యాయులు మాస్కులు తప్పనిసరిగా ధరించాలి.
- ప్రవేశ ద్వారాల్లో తప్పనిసరిగా శానిటైజర్లు, హ్యాండ్ వాషింగ్ సదుపాయాలు ఉండాలి.