ఇటీవల కరోనా బారిన పడ్డ పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఈ విషయాన్ని చట్టసభ్యుడు ఫైజల్ జావేద్ ఖాన్ మంగళవారం వెల్లడించారు. ప్రధాని పూర్తిగా కోలుకున్నారని ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశారు.
"ప్రధాని పూర్తిగా కోలుకున్నారు. వైద్యుల సూచనల మేరకు జాగ్రత్తలు పాటిస్తూ కార్యకలాపాల నిర్వహణకు ఉపక్రమించారు."
-ఫైజల్ జావేద్ ఖాన్, పాకిస్థాన్ చట్టసభ్యుడు
మార్చి 20న పాకిస్థాన్ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆయన సతీమణి బుశ్రా బీబీకి కరోనా సోకింది.
రాష్ట్రపతికి కరోనా..
పాకిస్థాన్ రాష్ట్రపతి డా. ఆరిఫ్ ఆల్వీ సహా పలువురు కీలక నేతలకు కరోనా సోకింది. రాష్ట్రపతికి కరోనా సోకినట్లు సోమవారం వెల్లడైంది. తనకు కొవిడ్ సోకినట్లు ఆల్వీ ట్వీట్ చేశారు.
"నాకు కొవిడ్ సోకినట్లు నిర్ధరణ అయింది. ఇటీవల టీకా తొలి డోసు తీసుకున్నాను. కానీ రెండో డోసు తీసుకున్నాకే యాంటిబాడీలు ఏర్పడతాయి. ఈ వారంలో రెండో డోసు తీసుకోవాల్సి ఉంది."
-డా. ఆరిఫ్ ఆల్వీ, పాకిస్థాన్ రాష్ట్రపతి
రక్షణ మంత్రి ఖట్టక్కు కూడా కరోనా సోకింది. ఖట్టక్కు కరోనా సోకడం ఇది రెండోసారి. గతేడాది మహమ్మారి బారిన పడిన కొద్దిరోజులకు ఆయన కోలుకున్నారు.
ఇదీ చదవండి :కరోనా విజృంభణతో ప్రపంచవ్యాప్తంగా మళ్లీ ఆంక్షలు