తెలంగాణ

telangana

By

Published : Jun 27, 2021, 7:55 AM IST

Updated : Jun 27, 2021, 11:40 AM IST

ETV Bharat / international

'మోదీ మా స్నేహహస్తం అందుకోలేదు'

భారత్​లో మరో నాయకత్వం ఉంటే చర్చలు జరిగేవని పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్​ఖాన్​ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు భారత్​తో సాధారణ సంబంధాల పునరుద్ధరణకు ప్రభుత్వం సహకరించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అమెరికాతో పక్షపాత రహిత బాంధవ్యాన్నే పాకిస్థాన్​ కోరుకుంటోందని స్పష్టం చేశారు.

imran khan
ఇమ్రాన్​ఖాన్

భారతదేశంలో సాధారణ సంబంధాల పునరుద్ధరణకు తాను చేసిన ప్రయత్నాలు ఫలించలేదని పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్​ఖాన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. 'ది న్యూయర్క్ టైమ్స్' పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత్, అమెరికాలతో తమ సంబంధాలపై ఆయన చర్చించారు. '2018 ఆగస్టులో నేను పాకిస్థాన్ ప్రధానమంత్రి పదవి చేపట్టగానే చేసిన మొట్టమొదటి పని భారత్​లో సాధారణ, నాగరిక, వ్యాపార సంబంధాల పునరుద్ధరణకు ప్రధాని నరేంద్ర మోదీకి స్నేహపూర్వక సంకేతాలు పంపటం. కానీ.. మా ప్రయత్నం ఫలించలేదు. బహుశా భారత్​లో మరో నాయకత్వం ఉంటే మా సంబంధాలు మెరుగుపడేవని భావిస్తున్నా. రెండు దేశాల మధ్య ఉన్న విభేదాలన్నీ చర్చల ద్వారా పరిష్కరించుకునేవాళ్లం' అని ఇమ్రాన్ అభిప్రాయపడ్డారు.

"జమ్ముకశ్మీర్​ ప్రత్యేకహోదా రద్దు చేసి, కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొడుతూ 2019 ఆగస్టులో భారత్ తీసుకున్న నిర్ణయాలతో రెండు దేశాల మధ్య అంతంత మాత్రంగా ఉన్న సంబంధాలు మరింత క్షీణించాయి. ఈ నిర్ణయం భారత్​కు చేటు చేస్తుందని నా అభిప్రాయం. తద్వారా ఇండియా, పాకిస్థాన్​ల నడుమ సాధారణ సంబంధాల పునరుద్ధరణకు ఉన్న ద్వారాలు మూసుకపోతాయి."

-ఇమ్రాన్​ ఖాన్​, పాకిస్థాన్​ ప్రధాని

చైనాతో పోరులో భారత్ ఓ బురుజులా తమకు ఉపయోగపడుతుందని అమెరికా ఆలోచించడం తప్పని.. చైనా, భారత్​ల మధ్య ఉన్న లాభదాయకమైన వ్యాపార సంబంధాలను సైతం ఇది దెబ్బతీస్తుందని ఇమ్రాన్ పేర్కొన్నారు.

'ఉపఖండంలో మా పాత్ర కీలకం..'

ప్రస్తుతం బ్రిటన్, భారత్​లతో అమెరికాకు స్నేహసంబంధాల మాదిరిగా పాకిస్థాన్ కూడా నాగరిక, పక్షపాత రహిత, వ్యాపార బాంధవ్యాలను అగ్రదేశంతో కోరుకుంటోందని ఇమ్రాన్​ఖాన్ తెలిపారు. అఫ్గాన్​ నుంచి అమెరికా దళాల ఉపసంహరణ తర్వాత ఉపఖండంలో ఇస్లామాబాద్ పాత్ర కీలకంగా మారుతుందని చెప్పారు. శ్వేతభవనంలో గత శుక్రవారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, అఫ్గానిస్థాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనిల నడుమ తొలి ముఖాముఖి చర్చలు జరిగిన నేపథ్యంలో ఉగ్రవాద వ్యతిరేక పోరులో అమెరికాకు భారత్ కంటే పాకిస్థాన్ సన్నిహిత భాగస్వామి అంటూ 'డాన్' పత్రికలో వచ్చిన కథనాన్ని ఇమ్రాన్ ఉటంకించారు. ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో దురదృష్టవశాత్తు అమెరికాతో తమ సంబంధాలు కొంత దెబ్బతిన్నాయని చెప్పారు.

ఇవీ చదవండి:

Last Updated : Jun 27, 2021, 11:40 AM IST

ABOUT THE AUTHOR

...view details