పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ విశ్వాస పరీక్షలో గెలుపొందారు. ఆ దేశ జాతీయ అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీలు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై విశ్వాస పరీక్ష పెట్టగా ఈ మేరకు విజయం సాధించారు. మెుత్తం 342 స్థానాలున్న ఆ దేశ దిగువ సభ పార్లమెంట్‌లో విజయానికి అవసరమైన 172 ఓట్లు ఇమ్రాన్ ప్రభుత్వం సాధించింది. ఇమ్రాన్‌కు మద్దతిస్తున్న మిత్రపక్షాల ఓట్లు కలుపుకొని 178 ఓట్లు సాధించింది.
ఇమ్రాన్‌పై విశ్వాస పరీక్షలో పాల్గొనబోమని 11 ప్రతిపక్ష పార్టీలు ఈ ఓటింగ్ నుంచి వైదొలిగాయి. ఈ విశ్వాస తీర్మానాన్ని విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషీ ప్రతిపాదించారు. అధికార పాకిస్థాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ ఉన్న 156 మంది సహా, మిత్రపక్షాలు ఈ విశ్వాసానికి వ్యతిరేకంగా ఓటు వేశాయి.