కరోనా వైరస్ రెండో దశ ఉద్ధృతిపై పోరాటం చేస్తున్న భారత ప్రజల పట్ల పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ సంఘీభావం వ్యక్తం చేశారు. అంతేకాకుండా మహమ్మారితో పోరాడుతున్న అన్ని దేశాలు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
''కరోనా వైరస్ రెండో దశపై పోరాటం చేస్తున్న భారత ప్రజలకు సంఘీభావం తెలియజేస్తున్నా. పొరుగుదేశం సహా ఇతర అన్ని దేశాలు మహమ్మారి బారి నుంచి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం. ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న ఈ సవాలుపై కలసికట్టుగా యుద్ధం చేయాలి''