తెలంగాణ

telangana

ETV Bharat / international

అందుకు సిద్ధమే.. ఆర్​ఎస్​ఎస్​ సిద్ధాంతమే అడ్డు: ఇమ్రాన్​ - పాక్​ ప్రధాని ఇమ్రాన్​

ఉగ్రవాద నిర్మూలనపై మరోమారు దాటవేసే సమాధానమిచ్చారు పాకిస్థాన్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​. తాము శాంతి స్థాపన కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నామని భారత్​కు చెప్పాలనుకుంటున్నామన్నారు. అయితే.. ఆర్​ఎస్​ఎస్​ సిద్ధాంతం అడ్డువచ్చిందని, ఇక చేసేదేమి లేదన్నారు.

Pakistan PM Imran Khan
పాకిస్థాన్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​

By

Published : Jul 16, 2021, 3:07 PM IST

ఉగ్రవాద నిర్మూలన, భారత్​తో శాంతి చర్చలపై అడిగిన ప్రశ్నకు మరోమారు దాటవేసే ప్రయత్నం చేశారు పాకిస్థాన్​ ప్రధానమంత్రి ఇమ్రాన్​ ఖాన్​. ఉజ్బెకిస్థాన్​లోని టాష్కెంట్​లో జరుగుతోన్న సెంట్రల్​- సౌత్​ ఆసియా కాన్ఫరెన్స్​కు హాజరైన సందర్భంగా.. ఆయనను ఏఎన్​ఐ విలేకరి పలు ప్రశ్నలు అడిగారు.

  1. ప్ర: ఉగ్రవాదానికి అడ్డుకట్ట వేయకుండా శాంతి చర్చలు సాధ్యమా? భారత్​ తరఫున మీకు ఇది సూటి ప్రశ్న.
    జ: శాంతి స్థాపన కోసం మేము ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నామని భారత్​కు చెప్పాలనుకుంటున్నాం. కానీ మధ్యలో ఆర్​ఎస్​ఎస్​ సిద్ధాంతం అడ్డు వచ్చింది. ఇక చేసేదేం ఉంది?
  2. ప్ర: తాలిబన్లను పాకిస్థాన్​ తనకు కావాల్సినట్లు ఆడిస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. మీరు ఏమంటారు?

తాలిబన్లపై ప్రశ్నించగానే.. ఎలాంటి సమాధానం ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు ఇమ్రాన్​. పలుమార్లు సమాధానం చెప్పాలని కోరినప్పటికీ స్పందించలేదు.

ఇదీ చూడండి:పీఓకే ప్రజల హక్కులు కాపాడతాం: ఇమ్రాన్​

ABOUT THE AUTHOR

...view details