తెలంగాణ

telangana

ETV Bharat / international

భావవక్తీకరణ స్వేచ్ఛలో పాతాళానికి పాక్​! - పత్రికా స్వేచ్ఛలో పాకిస్థాన్​ ర్యాంక్​

తమ దేశ పౌరుల భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు రక్షణ కల్పించే విషయంలో పాకిస్థాన్​ దారుణంగా విఫలమైందని ది న్యూస్​ ఇంటర్నేషనల్​ విడుదల చేసిన నివేదిక తెలిపింది. పత్రికా స్వేచ్ఛలోనూ పాక్​ చెత్త రికార్డును నమోదు చేసింది. 2020 సంవత్సరానికి గానూ పత్రికా స్వేచ్ఛలో 180 దేశాల్లో పాక్​ 145 స్థానానికి దిగజారిందని వరల్డ్​ ప్రెస్​ ఫ్రీడం ఇండెక్స్-2020, తెలిపింది.

Pakistan
పాకిస్థాన్​

By

Published : Apr 2, 2021, 12:45 PM IST

పౌరుల భావ వక్తీకరణ స్వేచ్ఛకు రక్షణలో పాకిస్థాన్​ ఘోరంగా విఫలమైనట్లు మీడియా మ్యాటర్స్​ ఫర్​ డెమోక్రసీ తెలిపింది. పాకిస్థాన్​ ప్రజాస్వామ్య వ్యక్తీకరణ నివేదిక-2020ను 'ది న్యూస్​ ఇంటర్నేషనల్'​ విడుదల చేసింది. ఈ నివేదికకు ఆరు అంశాల్ని ప్రాతిపదికగా తీసుకోగా..మొత్తం 100 పాయింట్లకు పాక్​ కేవలం 30 పాయింట్లే పొందింది.

నివేదిక పాకిస్థాన్​లో జర్నలిస్టులపై దాడులు, బెదిరింపులను ప్రముఖంగా పేర్కొందని పాక్​లోని ఐరోపా సమాఖ్య రాయబారి ఆండ్రూల్లా కమినారా తెలిపారు. పాకిస్థాన్​లో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఎలా ఉందో ఈ నివేదిక తేటతెల్లం చేస్తోందని పేర్కొన్నారు.

2020లో మీడియాపై పాక్​ ప్రభుత్వం విపరీత ఆంక్షలు విధించినట్లు నివేదిక తెలిపింది. చాలా డిజిటల్​ మీడియాలపై నిషేధం విధించిందని.. సామాజిక మాధ్యమాల్లో రాజకీయ, తదితర అంశాలపై మాట్లాడకుండా నియంత్రించిందని వెల్లడించింది.

పత్రికా స్వేచ్ఛలోనూ చెత్త రికార్డు

పత్రికా స్వేచ్ఛలోనూ పాక్​ చెత్త రికార్డును నమోదు చేసింది. 2020 సంవత్సారనికి గానూ పత్రికా స్వేచ్ఛలో 180 దేశాల్లో పాక్​ 145 స్థానానికి దిగజారిందని వరల్డ్​ ప్రెస్​ ఫ్రీడం ఇండెక్స్-2020 తెలిపింది. 2017 నుంచి వరుసగా పాక్​ పత్రికా స్వేచ్ఛలో దిగజారుతూనే ఉందని వెల్లడించింది.

11మంది పాత్రికేయుల హత్య

పాక్​లో జర్నలిస్టులపై దూషణలు, దాడులు, చిత్రహింసలు, హత్యలు నిత్యం జరుగుతూనే ఉన్నాయని నివేదిక పేర్కొంది. గత ఐదు సంవత్సరాల్లో పాక్​లో 11మంది పాత్రికేయుల్ని హత్య చేశారని .. అందులో ఏడుగురి హత్యలు ఇమ్రాన్​ ఖాన్​ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జరిగాయని ది న్యూయార్క్​ టైమ్స్​ వెల్లడించింది.

ఇదీ చదవండి:పాక్​లో హిందూ భక్తులను అడ్డుకున్న భద్రతా సిబ్బంది

ABOUT THE AUTHOR

...view details