తెలంగాణ

telangana

ETV Bharat / international

పాక్​లో 72 ఏళ్లకు హిందూ ఆలయంలో పూజలు - పాకిస్థాన్

పాకిస్థాన్​లోని సియాల్​కోట్​లో ఉన్న హిందూ దేవాలయం 72 ఏళ్ల తరువాత తెరుచుకుంది. ఈ ఆలయానికి  వెయ్యేళ్ల చరిత్ర ఉంది. దేశ విభజనతో మూతబడిన ఆలయాన్ని తెరిచి స్థానిక హిందువులకు ప్రవేశం కల్పించింది అక్కడి ప్రభుత్వం.

పాక్​లో 72 ఏళ్ల తర్వాత తెరుచుకున్న హిందూ ఆలయం

By

Published : Jul 30, 2019, 5:11 AM IST

Updated : Jul 30, 2019, 7:39 AM IST

దేశ విభజనతో మూతపడిన పాకిస్థాన్​లోని వెయ్యేళ్ల నాటి చారిత్రక హిందూ దేవాలయంలో మళ్లీ పూజలు ఆరంభమయ్యాయి. ఆలయాన్ని తెరవాలన్న స్థానిక హిందువుల డిమాండ్​ మేరకు చర్యలు చేపట్టిన పాక్​ ప్రభుత్వం... 72 ఏళ్ల తర్వాత ప్రవేశానికి అనుమతినిచ్చింది.

ఎంతో చరిత్ర ఉన్న దేవాలయం...

'శావాల తేజ్​ సింహ్​​' శివాలయం లాహోర్​కు 100 కిలోమీటర్ల దూరంలోని సియాల్​కోట్​లో ఉంది. ప్రముఖ రచయిత రషీద్​ నియాజ్​ రచించిన 'సియాల్​ కోట్​ చరిత్ర' పుస్తకం ప్రకారం ఆలయానికి వెయ్యేళ్ల చరిత్ర ఉంది. కానీ దేశ విభజన సమయంలో పూజలకు దూరమైంది.

చారిత్రక ఆలయమైనందున దీన్ని పునరుద్ధరించాలని భావించిన పాక్​ ప్రభుత్వం అందుకనుగుణంగా చర్యలు చేపట్టింది. పనులు దాదాపు కొలిక్కి రావడం వల్ల దేవాలయాన్ని తెరిచి, స్థానిక హిందువులకు ప్రవేశం కల్పించారు అధికారులు.

ఆలయాన్ని పునరుద్ధరించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్థానిక హిందూ నాయకులు స్వాగతించారు.

ఇదీ చూడండి: అమెరికా ఆశ్రయం కోసం భారతీయుల నిరశన- భగ్నం

Last Updated : Jul 30, 2019, 7:39 AM IST

ABOUT THE AUTHOR

...view details