Pakistan on Kashmir: అంతర్జాతీయ వేదికపై మరోసారి కశ్మీర్ ప్రస్తావన తీసుకొచ్చింది. ఓఐసీ(ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్) విదేశాంగ మంత్రుల సమావేశంలో కశ్మీర్‌తో పాటు ఇజ్రాయెల్ సమస్యలను పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ లేవెనెత్తారు. అఫ్గానిస్థాన్ అంశంపై చర్చించేందుకు వీరు సమావేశమైనప్పటికీ.. ఈ భేటీ తర్వాత విడుదల చేసిన 'ఇస్లామిక్ డిక్లరేషన్'లో ఇజ్రాయెల్ అంశాన్ని ప్రస్తావించారని ఇటలీ రాజకీయ నిపుణుడు సెర్గియో రెస్టెలీ తెలిపారు.
OIC meeting Kashmir
"అఫ్గానిస్థాన్ సంక్షోభానికి, ఇజ్రాయెల్‌కు సంబంధం లేకపోయినప్పటికీ.. ఇస్లామిక్ డిక్లరేషన్‌లో ఇజ్రాయెలే ముఖ్యమైన అంశంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక అఫ్గాన్ అంశంపై డిక్లరేషన్‌లో పెద్దగా వివరాలేవీ పేర్కొనలేదు. ఇస్లామిక్ అభివృద్ధి బ్యాంకు ద్వారా ఓ ట్రస్టు ఫండ్‌ను ఏర్పాటు చేసి అఫ్గాన్‌కు సాయం చేస్తామని చెప్పారు. ఓఐసీ దేశాలు ఈ బ్యాంకుకు నిధులు అందిస్తాయని తెలిపారు. అయితే, ఎవరెవరు, ఏ విధంగా నిధులు అందిస్తారనే విషయంపై డిక్లరేషన్‌లో ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు."
-సెర్గియో రెస్టెలీ, ఇటలీ రాజకీయ నిపుణుడు