భారత్-పాకిస్థాన్ల మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి తమ దేశం ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉందని పాక్ విదేశాంగ ప్రతినిధి జాహిద్ హఫీజ్ చౌదరి తెలిపారు. కశ్మీర్ సహా మిగతా అన్నీ వివాదాలను శాంతియుతంగా పరిష్కరించేందుకు చర్చలు జరపడానికి తాము ఎప్పుడూ దూరంగా ఉండబోమని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన సైనిక ఉన్నతాధికారుల సమావేశంపై మాట్లాడారు. ఈ క్రమంలో భారత్తో చర్చలపై ఓ పాత్రికేయుడు ప్రశ్నించగా ఇందుకు బదులుగా సమాధానం ఇచ్చారు.
"ఇరుదేశాల మధ్యన ఉండే సమస్యల పరిష్కారానికి మేం ఎప్పుడూ సిద్ధమే. అందులో మొహమాటాలు ఏమీ లేవు. కశ్మీర్ సహా మిగతా వాటిపై కూడా చర్చలు జరపాలి. అత్యుత్తమ శాంతియుత పరిష్కారం కనుక్కోవాలి."
-జాహిద్ హఫీజ్ చౌదరి, పాకిస్థాన్ విదేశాంగ శాఖ
స్నేహపూర్వక సంబంధాలే కావాలి..