Pakistan National Security Policy: 'పాకిస్థాన్‌ను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా కొత్త జాతీయ భద్రతా విధానం రూపొందించాం. గతంలో ఐఎంఎఫ్ (అంతర్జాతీయ ద్రవ్యనిధి) వంటి సంస్థలను రుణాల కోసం మనం ఆశ్రయించాం. దేశం బలమైన ఆర్థికశక్తిగా ఎదిగే ప్రణాళికలను పెద్దగా పట్టించుకోలేదు. అభివృద్ధిపరంగా వెనుకబడిన బలహీనవర్గాలకు చేయూతనిద్దాం. కొన్ని వర్గాలుగా కాదు.. ఓ జాతిగా మనందరం అభివృద్ధి సాధించాలి. ఇదే సరైన జాతీయ భద్రతా విధానం' అని పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ వ్యాఖ్యానించారు. ఇస్లామాబాద్‌లోని ప్రధాని కార్యాలయంలో శుక్రవారం జరిగిన దేశ జాతీయ భద్రతా విధానం ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. గతంలో సైనిక సామర్థ్యాలు పెంచుకోవడంపై ఎక్కువగా దృష్టి పెట్టిన పాకిస్థాన్.. చరిత్రలో తొలిసారి దేశ పౌరుల ప్రగతి ధ్యేయంగా జాతీయ భద్రతా విధానాన్ని రూపొందించింది. జాతీయ భద్రతా కమిటీ (ఎన్‌ఎస్‌సీ)తోపాటు పాక్ కేబినెట్ గత నెల ఈ విధానానికి ఆమోదం తెలిపింది. ఎన్‌ఎస్‌సీ ఈ కొత్త విధానం ప్రగతిని తరచూ సమీక్షిస్తుందని ఇమ్రాన్ ప్రకటించారు. అయిదేళ్లపాటు అమలులో ఉండే ఈ విధానాన్ని వంద పేజీల డాక్యుమెంటుగా రూపొందించేందుకు ఏడేళ్లు పట్టింది. ఆవిష్కరణ కార్యక్రమానికి పలువురు ప్రభుత్వ ప్రముఖులు హాజరయ్యారు.
రక్షణమంత్రిని బుజ్జగించిన ఇమ్రాన్