ఉగ్రవాద కార్యకలాపాలకు వంతపాడుతున్న పాకిస్థాన్.. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్) గ్రే జాబితాలోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. పాక్ గురించి చర్చించిన అధికారులు, విదేశీ రాయబారులు.. గ్రే లిస్ట్ నుంచి తప్పించే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారని డాన్ పత్రిక వెల్లడించింది. సానుకూల ఫలితం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని కొందరు అధికారులు అభిప్రాయపడగా.. కొందరు దౌత్యవేత్తలు మాత్రం కనీసం జూన్ వరకు పాక్‌ను గ్రే లిస్ట్‌లోనే ఉంచాలని స్పష్టం చేసినట్లు పేర్కొంది.
ప్లీనరీలో పాక్‌ను గ్రే లిస్ట్‌లోనే ఉంచడం, అందులో నుంచి తొలగించడం సహా ఉన్న అన్ని అవకాశాలను పరిశీలించనున్నట్లు తెలిపింది డాన్. ఎఫ్ఏటీఎఫ్ నివేదిక ఆధారంగా చర్చలు ఉంటాయని వెల్లడించింది. ఈ నివేదికలో పాక్‌కు ప్రతికూలంగా ఉన్న అంశాలపై స్నేహపూర్వక దేశాలు అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం ఉందని, కాబట్టి చర్చ మరింత సుదీర్ఘంగా సాగుతుందని పేర్కొంది.
జూన్ తర్వాత బయటపడేనా!