అమెరికా సేనల ఉపసంహరణ అనంతరం అఫ్గానిస్థాన్‌లో నెలకొన్న శాంతి భద్రతలపై చర్చించేందుకు జాతీయ భద్రతా సలహాదారుల స్థాయిలో భారత్ నిర్వహిస్తున్న సదస్సులో(India Nsa Meeting On Afghanistan) పాల్గొనేందుకు రష్యా, ఇరాన్ సహా పలు మధ్యాసియా దేశాలు సుముఖత వ్యక్తపరిచాయి. పాకిస్థాన్, చైనా మాత్రం ఇంకా అంగీకారం తెలపలేదు.
అఫ్గాన్‌పై భారత్ సదస్సు.. పాక్ గుర్రు!
అఫ్గాన్‌లో నెలకొన్న శాంతి భద్రతలపై చర్చించేందుకు ఈ నెల 10న జాతీయ భద్రతా సలహాదారుల స్థాయిలో భారత్ ఓ సదస్సు(India Nsa Meeting On Afghanistan) నిర్వహించనుంది. అయితే.. భారత్ ఈ భేటీని నిర్వహించడాన్ని పాకిస్థాన్ తప్పుపట్టింది.
అఫ్గాన్‌పై భారత్ సదస్సు
అఫ్గాన్‌పై భారత్ సమావేశం(India Nsa Meeting On Afghanistan) నిర్వహించడంపై ఇప్పటికే పాకిస్థాన్ గుర్రుగా ఉంది. ఈ సమావేశం.. అఫ్గాన్ శాంతిప్రక్రియలో తమ పాత్రను ఎక్కడ తగ్గిస్తుందోనని ఆ దేశం భయపడుతోంది. ఇప్పటికే పాక్ జాతీయ భద్రతా సలహాదారుడు యూసుఫ్... భారత్‌లో నిర్వహిస్తున్న సదస్సును తప్పుపట్టారు. ఈ నెల 10న జరగనున్న సదస్సుకు జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ డోభాల్ అధ్యక్షత వహించనున్నారు.
ఇదీ చూడండి:తాలిబన్లతో నిరంతరం టచ్‌లో పాక్ సైన్యం!