భారత్కు చెందిన 17 మంది మత్స్యకారులను పాకిస్థాన్ మారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ అధికారులు అరెస్ట్ చేశారు. వారికి సంబంధించిన మూడు బోట్లను స్వాధీనం చేసుకున్నారు.
17 మంది భారత జాలర్లను అరెస్ట్ చేసిన పాక్ - భారత మత్స్యకారులను అరెస్ట్ చేసిన పాక్
అరేబియా సముద్రంలో తమ సరిహద్దు జలాల్లోకి ప్రవేశించారనే కారణంగా 17 మంది భారతీయ జాలర్లను పాక్ అధికారులు అరెస్ట్ చేశారు. వారికి చెందిన మూడు బోట్లను సీజ్ చేసినట్లు పాక్ మారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ అధికారులు తెలిపారు.
![17 మంది భారత జాలర్లను అరెస్ట్ చేసిన పాక్ Pakistan has arrested 17 Indian fishermen and confiscated their three boats](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10812791-thumbnail-3x2-fish.jpg)
17 మంది భారత జాలర్లను అరెస్ట్ చేసిన పాక్
అరేబియా సముద్రంలో భారత్-పాక్ కోస్టల్ సరిహద్దుకు 10 నుంచి 15 నాటిక మైళ్లు దూరంలోని సర్ క్రీక్ ప్రాంతంలో పాక్ సముద్ర జలాల్లోకి ప్రవేశించారనే ఆరోపణతో ఈ నెల 26న మత్స్యకారుల్ని అరెస్ట్ చేసినట్లు పాక్ అధికారులు వెల్లడించారు. 27న కోర్టులో హాజరుపరిచి.. అనంతరం పోలీసులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. వారిని కరాచీలోని లాంథీ లేదా మార్లిన్ జైలుకు పంపనున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి:అంటార్కిటికాలో భారీ మంచుకొండకు పగుళ్లు