తెలంగాణ

telangana

ETV Bharat / international

పాక్​ విదేశాంగ మంత్రికి కరోనా పాజిటివ్​ - mohamood qureshi news

పాకిస్థాన్​లో కరోనా మహమ్మారి అంతకంతకూ విస్తరిస్తోంది. తాజాగా ఆ దేశ విదేశాంగ మంత్రి షా మొహమూద్ ఖురేషి వైరస్​ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్​లో వెల్లడించారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని, ఇంటి నుంచే విధులు నిర్వహిస్తానని పేర్కొన్నారు.

Pakistan Foreign Minister Qureshi tests positive for COVID-19
పాక్​ విదేశాంగ మంత్రికి కరోనా పాజిటివ్​

By

Published : Jul 4, 2020, 5:39 AM IST

పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రి షా మెహమూద్‌ ఖురేషికి కరోనా సోకింది. తనకు పాజిటివ్‌గా తేలినట్లు శుక్రవారం ఆయన వెల్లడించారు. ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నట్లు తెలిపారు. పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఇ-ఇస్లామీ నేత ట్విటర్‌లో పేర్కొంటూ 'ఈరోజు మధ్యాహ్నం జ్వరంతో అస్వస్థతగా అనిపించింది. దీంతో వెంటనే క్వారంటైన్‌లోకి వెళ్లాను. వైద్య పరీక్షలు నిర్వహించుకోగా కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నాను. ఇంటినుంచే విధులు నిర్వహిస్తాను. నా క్షేమం కోసం ప్రార్థించండి' అని పేర్కొన్నారు.

పాకిస్థాన్‌లోనూ వైరస్‌ ఉగ్రరూపం దాల్చింది. ఇప్పటివరకు 2.21 లక్షల మందికి మహమ్మారి సోకింది. 4500 మందికిపైగా మరణించారు.

ఇదీ చూడండి: కరోనా కాలంలోనూ ఈ రెస్టారెంట్​లో హాయిగా తినొచ్చు!

ABOUT THE AUTHOR

...view details