మరో రెండు కేసుల్లో హఫీజ్ సయీద్‌కు పదేళ్లు జైలు - Hafiz Saeed latest news
15:47 November 19
హఫీజ్ సయీద్‌కు 10 ఏళ్ల జైలు
2008 ముంబయి ఉగ్రదాడుల సూత్రధారి, జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్‌కు పాకిస్థాన్ కోర్టు 10 ఏళ్ల జైలు శిక్షను విధించింది. ఉగ్రసంస్థలకు నిధులు సమకూర్చిన రెండు కేసులకు సంబంధించి యాంటీ-టెర్రరిజం కోర్టు ఈ తీర్పునిచ్చింది.
ఈ కేసుల విషయంలో ఇప్పటికే సయీద్.. గతేడాది జులై 17 నుంచి జైలులోనే ఉంటున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రెండు కేసుల్లో 11 ఏళ్ల శిక్ష పడగా.. తాజాగా మరో పదేళ్లు జైలు విధించింది కోర్టు.
సయీద్ సన్నిహితులైన జఫర్ ఇక్బాల్, యాహ్యా ముజాహిద్‌లకు కూడా పదిన్నర ఏళ్లు, కజిన్ అబ్దుల్ రెహమాన్ మక్కీకి ఆర్నెల్లు జైలు శిక్ష పడింది.