తెలంగాణ

telangana

ETV Bharat / international

Pakistan Counter Terrorism: 'పాక్​ కేంద్రంగా భారత్​పై ఉగ్రముఠాలు'

Pakistan Counter Terrorism: పాకిస్థాన్‌ కేంద్రంగానే ఉగ్రముఠాలు భారత్‌ లక్ష్యంగా చేసుకొని దాడులకు తెగబడుతున్నట్లు అమెరికా పునరుద్ఘాటించింది. ముఖ్యంగా ముంబయి సూత్రధారి మసూద్‌ అజర్‌, సాజిద్‌ మీర్‌లపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలిపింది. మరోవైపు.. భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలను గుర్తించడంలో జాతీయ దర్యాప్తు సంస్థతో (ఎన్​ఐఏ) పాటు ఇతర తీవ్రవాద నిరోధక దళాలు చురుగ్గా పనిచేస్తున్నాయని అమెరికా ప్రశంసించింది.

pakistan counter terrorism
పాక్​లో ఉగ్రవాదం

By

Published : Dec 17, 2021, 10:31 PM IST

Pakistan Counter Terrorism: పాకిస్థాన్‌ కేంద్రంగానే ఉగ్రముఠాలు భారత్‌ లక్ష్యంగా చేసుకొని దాడులకు తెగబడుతున్నట్లు అమెరికా మరోసారి స్పష్టం చేసింది. అయినా అటువంటి వాటిపై పాకిస్థాన్‌ చర్యలు తీసుకోవడం లేదని పేర్కొంది. ముఖ్యంగా ముంబయి దాడుల సూత్రధారి మసూద్‌ అజర్‌, సాజిద్‌ మీర్‌లపై ఎటువంటి చర్యలు తీసుకోలేదన్న అమెరికా.. వారు ఆ దేశంలో స్వేచ్ఛగా తిరుగుతున్నారని వెల్లడించింది. ఉగ్రవాదానికి సంబంధించి- 2020 నివేదికను విడుదల చేసిన అమెరికా విదేశాంగశాఖ మంత్రి ఆంటోని బ్లింకెన్‌.. పాకిస్థాన్‌ కేంద్రంగానే ఉగ్రముఠాలు పనిచేస్తున్నాయని మరోసారి ఉద్ఘాటించారు.

"పాక్‌ కేంద్రంగానే ఉగ్రముఠాలు పనిచేస్తున్నాయి. లష్కర్​-ఏ-తోయిబా, జైషే మహమ్మద్‌తో పాటు అనుబంధ సంస్థలు పాక్‌ నుంచి భారత్‌పై దాడులకు పాల్పడుతున్నాయి. పాక్‌లోని కొన్ని మదర్సాల్లో తీవ్ర భావజాలాన్ని పెంచిపోషిస్తున్నారు. దాదాపు 12 ఉగ్రసంస్థలకు పాక్‌ కేంద్రంగా మారింది."

-అమెరికా రక్షణ శాఖ

ఇదీ చూడండి:ప్రధాని మోదీకి భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం

భారత్ భేష్​..

India Against Terrorism: లష్కర్​-ఏ-తోయిబా, జైషే మహమ్మద్​, హిజ్బుల్ ముజాహిదీన్​, ఐసిస్​, అల్​-ఖైదా వంటి ఉగ్రసంస్థలు.. భారత్​లోని జమ్ముకశ్మీర్​, ఈశాన్య భారత్​, మధ్య భారత్​లోని వివిధ ప్రాంతాల్లో యాక్టివ్​గా ఉన్నాయని అమెరికా నివేదిక తెలిపింది. ఈ ఉగ్రసంస్థల కార్యకలాపాలను అణచివేయడంలో భారత్​ నిర్మాణాత్మక పాత్ర పోషిస్తోందని చెప్పింది.

జమ్ముకశ్మీర్​లో అల్​-ఖైదా అనుబంధ సంస్థ అన్సర్ ఘజ్వాత్​-ఉల్​-హింద్​కు చెందిన పలువురు కీలక ఉగ్రనేతలను భారత దళాలు అణచివేసిన విషయాన్ని అమెరికా తన నివేదికలో ప్రస్తావించింది. ఈశాన్య ప్రాంతంలో ముష్కరుల కార్యకలపాలు కొనసాగుతున్నప్పటికీ.. ఉగ్ర హింస స్థాయులు తగ్గాయని చెప్పింది. దేశంలో ఖలిస్థానీ గ్రూపు ప్రాబల్యం తగ్గిందని పేర్కొంది. అయితే.. భద్రతా దళాల మధ్య ఇన్ఫర్మేషన్​ షేరింగ్​లో కొన్ని అంతరాలు ఉన్నాయని తెలిపింది.

ఐసిస్​లో 66 మంది

Nia Terrorism: భారత్​కు చెందిన 66 మంది.. ఉగ్రసంస్థ ఇస్లామిక్ స్టేట్​లో​(ఐసిస్​) భాగంగా పని చేస్తున్నారని అమెరికా తన నివేదికలో పేర్కొంది. 2020లో విదేశీ ఉగ్రవాదులు (ఫారిన్ టెర్రిరిస్ట్ ఫైటర్స్​) ఎవరూ భారత్​కు తిరిగి రాలేదని చెప్పింది. ఐసిస్​తో సంబంధం ఉన్న 34 ఉగ్రవాద కార్యకలాపాలకు చెందిన కేసులను జాతీయ భద్రతా దళం దర్యాప్తు చేసిందని చెప్పింది. 160 మందిని అరెస్టు చేసినట్లు చెప్పింది. అందులో బంగాల్, కేరళ కేంద్రంగా పని చేసే 10 మంది అల్​- ఖైదా ఉగ్రవాదులు కూడా ఉన్నారని వెల్లడించింది. వీటితోపాటు తీవ్రవాద శక్తులను గుర్తించి, వాటిని ముందుగానే నిరోధించడంలోనూ రాష్ట్ర స్థాయి విభాగాలు సమర్థంగా వ్యవహరిస్తున్నాయని తెలిపింది.

ఇదీ చూడండి:భారత్​ను విస్మరించిన అమెరికా- రష్యానే కారణం!

ABOUT THE AUTHOR

...view details