తెలంగాణ

telangana

ETV Bharat / international

బైక్​ను తప్పించబోయి రెండు బస్సులు ఢీ- 10 మంది మృతి - పంజాబ్ బస్సు ప్రమాదం

Pakistan Bus accident: ఎదురెదురుగా వస్తున్న రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో 10 మంది మరణించారు. మరో 40 మంది వరకు గాయపడ్డారు. బైకర్​ను తప్పించే క్రమంలో బస్సు.. మరో బస్సును ఢీకొట్టినట్లు అధికారులు తెలిపారు.

Pakistan Bus accident
Pakistan Bus accident

By

Published : Jan 4, 2022, 5:59 PM IST

Pakistan Bus accident: పాకిస్థాన్ పంజాబ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బస్సులు ఒకదానినొకటి ఢీకొన్న ఘటనలో పది మంది మరణించారు. మరో 40 మంది గాయపడ్డారు. సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది.

Pakistan Punjab Bus accident

పంజాబ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ రెస్క్యూ వివరాల ప్రకారం.. ఓ బస్సు లాహోర్ నుంచి హసిల్పుర్​కు వెళ్తోంది. మరో బస్సు ఎదురుగా వస్తోంది. బస్తీ భూరీ షా వద్ద.. ఓ బస్సు డ్రైవర్.. వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. ద్విచక్రవాహనంపై వెళ్తున్న వ్యక్తిని తప్పించే క్రమంలో.. ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టాడు. దీంతో ఆరుగురు అక్కడికక్కడే మరణించారని అధికారులు వెల్లడించారు. ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. బైక్​పై వెళ్తున్న వ్యక్తి సైతం ప్రాణాలు కోల్పోయాడని స్పష్టం చేశారు.

ఈ ప్రమాదంపై పంజాబ్ ముఖ్యమంత్రి ఉస్మాన్ బుజ్దర్ విచారం వ్యక్తం చేశారు. ప్రాణనష్టంపై ఆవేదన వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.

ఇదీ చదవండి:కొండచరియలు విరిగిపడి 14మంది మృతి

ABOUT THE AUTHOR

...view details