తెలంగాణ

telangana

ETV Bharat / international

రోడ్డు పక్కన పేలిన బాంబు.. నలుగురు మృతి! - బాంబు దాడి

Pakistan bomb blast: రోడ్డు పక్కన బాంబు పేలుడు సంభవించి వాహనంలో వెళ్తున్న నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన పాకిస్థాన్​లోని బలోచిస్థాన్​ రాష్ట్రంలో శుక్రవారం జరిగింది.

pakistan bomb blast
బాంబు పేలుడు

By

Published : Jan 28, 2022, 8:31 PM IST

Pakistan bomb blast: పాకిస్థాన్​ నైరుతి ప్రాంతం బలోచిస్థాన్​ రాష్ట్రంలో శుక్రవారం భారీ పేలుడు సంభవించింది. రోడ్డు పక్కన జరిగిన బాంబు పేలుడులో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు.

డేరా బుగ్టి జిల్లాలోని మాట్​ ప్రాంతంలో బాధితులు ఓ వాహనంలో ప్రయాణిస్తుండగా బాంబు పేలినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ దాడిలో తన బంధువు ఒకరు సైతం ప్రాణాలు కోల్పోయినట్లు ఆ ప్రాంత సెనేటర్​ సర్ఫరాజ్​ బుగ్టి తెలిపారు. ఈ పేలుడు వెనక నిషేధిత బలోచ్​ రిపబ్లిక్​ ఆర్మీ(బీఎల్​ఏ) ఉన్నట్లు భావిస్తున్నామన్నారు.

" అమాయక ప్రజలను కాపాడటంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ఇలాంటి ఘటనలు.. ప్రజలు సొంతంగా రక్షణ చర్యలు ఏర్పాటు చేసుకునేందుకు కారణమవుతాయి. బలోచిస్థాన్​లో తగిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది."

- సర్ఫరాజ్​ బుగ్టి, స్థానిక సెనేటర్​.

రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు ఉగ్రమూకలు మరోమారు క్రూరమైన చర్యలకు పాల్పడ్డాయని పేర్కొన్నారు బలోచిస్థాన్​ రాష్ట్ర ముఖ్యమంత్రి మిర్​ అబ్దుల్​ క్యద్దుస్​ బిజెంజో. ఉగ్రవాదులపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

ఇదే రాష్ట్రంలోని కెచ్​ ప్రాంతంలో సైనిక స్థావరంపై దాడి జరిగి 10 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన రెండు రోజుల తర్వాతే ఈ పేలుడు జరగటం గమనార్హం.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి:ఉగ్రదాడిలో 10 మంది పాక్​ సైనికులు మరణం

ABOUT THE AUTHOR

...view details