తెలంగాణ

telangana

ETV Bharat / international

11 ఉగ్రవాద అనుబంధ సంస్థలపై పాక్​ నిషేధం

జైషే మహ్మద్​, జమాత్​ ఉద్​ దవా ఉగ్రవాద సంస్థలతో సంబంధమున్న 11 అనుబంధ సంస్థలపై పాకిస్థాన్​ ప్రభుత్వం నిషేధం విధించింది.

11 ఉగ్రవాద అనుబంధ సంస్థలపై పాక్​ నిషేధం

By

Published : May 12, 2019, 4:44 AM IST

Updated : May 12, 2019, 7:07 AM IST

11 ఉగ్రవాద అనుబంధ సంస్థలపై పాక్​ నిషేధం

అంతర్జాతీయ ఒత్తిళ్ల కారణంగా.. పాకిస్థాన్​ ప్రభుత్వం లాహోర్​ కేంద్రంగా పని చేస్తోన్న 11 ఉగ్రవాద అనుబంధ సంస్థలపై నిషేధం విధించింది. జైషే మహమ్మద్ , జమాత్​ ఉద్​ దవా (జేయూడీ) ఉగ్రసంస్థలతో వాటికి సంబంధాలున్నాయి.

పాక్ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​,​ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి ఇజాజ్​షా మధ్య శుక్రవారం జరిగిన సమావేశంలో ఈ ఉగ్రవాద అనుబంధ సంస్థలను నిషేధించాలని నిర్ణయించారు. పాకిస్థాన్​ భూ భాగం కేంద్రంగా ఇతర దేశాలకు హాని కలిగించే ఉగ్రవాద కార్యకలాపాలను ఎన్నటికీ సహించబోమని ఇమ్రాన్ ​ఖాన్ స్పష్టం చేశారు.

పాకిస్థాన్​ ప్రభుత్వం మార్చి నెలలోనే జేయూడీతో సంబంధమున్న 7 ఉగ్రవాద అనుబంధ సంస్థలపై నిషేధం విధించిందని పాక్​ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ వెబ్​సైట్​లో పేర్కొంది. తాజాగా మరో 11 సంస్థలపై చర్యలు తీసుకుంది.

నిషేధం వీటిపైనే..

అల్​-అన్ఫాల్ ట్రస్ట్​, ఇదర ఖిద్మత్​-ఇ-కలాఖ్​, అల్-దావత్-ఉల్​-ఇర్షాద్​, మజీద్​​ అండ్​ వెల్ఫేర్​ ట్రస్ట్​, అల్​-మదీనా ఫౌండేషన్​, మజ్​-బిన్-జాబెల్​ ఎడ్యుకేషన్​ ట్రస్ట్​, అల్-హమాద్​ ట్రస్ట్​లను నిషేధించింది పాక్​ ప్రభుత్వం.

అలాగే ఎఫ్​ఐఎఫ్​తో సంబంధమున్న అల్-ఫజల్ ఫౌండేషన్​/ట్రస్ట్​, అల్​-ఇసర్​ ఫౌండేషన్​లనూ నిషేధించినట్లు ఎన్ఏసీటీసీ ప్రకటించింది. ఇవన్నీ లాహోర్ కేంద్రంగా పనిచేస్తోన్న ఉగ్రవాద అనుబంధ సంస్థలు.

బహవల్పూర్​ కేంద్రంగా పని చేస్తోన్న అల్​-రహమత్​ ట్రస్ట్​ ఆర్గనైజేషన్​, కరాచీ కేంద్రంగా పనిచేస్తోన్న అల్-ఫుర్ఖన్​ ట్రస్ట్​లనూ నిషేధిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు.
ఇటీవలి కాలంలో పాక్ ప్రభుత్వం సుమారు 30 వేల మతపరమైన సదస్సులను నియంత్రించింది.

పాకిస్థాన్ కేంద్రంగా పని చేస్తోన్న 'జైషే మహ్మద్​​' ఉగ్ర సంస్థ వ్యవస్థాపకుడు మసూద్​ అజార్​ను మే 1న ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. జమ్ముకశ్మీర్​లోని పుల్వామాలో ఉగ్రదాడికి పాల్పడి 40 మంది భారత సీఆర్పీఎఫ్ జవాన్లను బలిగొన్న ఘటనకు మసూద్ సూత్రధారి.

సయీద్​ హఫీజ్​ నేతృత్వంలోని జమాత్ ఉద్​ దవా (జేయూడీ) ఉగ్రసంస్థను పాకిస్థాన్​ ప్రభుత్వం ఫిబ్రవరిలోనే నిషేధించింది. అలాగే దాని స్వచ్ఛంద సంస్థ ఫలాహ్-ఇ-ఇన్సానియత్ ఫౌండేషన్​ (ఎఫ్​ఐఎఫ్​)పైనా మార్చిలో నిషేధం విధించింది. ఈ ఉగ్రవాద సంస్థలే 2008 ముంబయి దాడులకు పాల్పడింది.

ఇదీ చూడండి: 'హోటల్​పై దాడి మా పనే'-బలూచ్ లిబరేషన్ ఆర్మీ

Last Updated : May 12, 2019, 7:07 AM IST

ABOUT THE AUTHOR

...view details