తెలంగాణ

telangana

ETV Bharat / international

ఇంధన ధరలను 66 శాతం పెంచనున్న ప్రభుత్వం!

ఆర్థిక సంవత్సరం రెండురోజుల్లో ముగుస్తుందనగా పాకిస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంధన ధరలను భారీగా పెంచనున్నట్లు ప్రకటించింది. కరోనా సంక్షోభం కారణంగా ఆ దేశ జీడీపీ పతనమైన నేపథ్యంలో ఆ దేశ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. ఇంధన ధరల పెంపు నిర్ణయాన్ని సామాజిక మాధ్యమాల్లో తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు పాక్​ ప్రజలు.

Pakistan announces record increase in fuel prices
ఇంధన ధరలను 66శాతం పెంచనున్న ప్రభుత్వం!

By

Published : Jun 28, 2020, 11:23 AM IST

Updated : Jun 28, 2020, 12:27 PM IST

అప్పులపాలై ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాకిస్థాన్​కు కరోనాతో ఆ కష్టాలు రెట్టింపయ్యాయి. ఈ నేపథ్యంలో దేశ జీడీపీని కాాపాడుకునేందుకు ఇంధన ధరలను రికార్డు స్థాయిలో పెంచనున్నట్లు ఇమ్రాన్​ ఖాన్​ ప్రభుత్వం ప్రకటించింది. పెట్రోలియం ఉత్పత్తుల అధారంగా 22నుంచి 66శాతం మేర చమురు ధరలు పెరిగే అవశామున్నట్లు తెలిపింది.

కరోనా సంక్షోభం కారణంగా పాక్​ జీడీపీ వృద్ధి తొలిసారి 0.4 శాతం క్షీణించనున్నట్లు రెండు వారాల క్రితమే తెలిపింది ప్రభుత్వం. మొదట 2.4 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనా వేసినప్పటికీ.. కరోనా దెబ్బకు పరిస్థితులు తలకిందులయ్యాయి. పాక్ ప్రధానిగా ఇమ్రాన్​ ఖాన్​ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆ దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా క్షీణిస్తోంది.

ఇంధన ధరలు పెంచాలనే పాక్​ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా నిరసన వ్యక్తం చేస్తున్నారు.

కరోనా కట్టడికి మార్చిలో లాక్​డౌన్​ ప్రకటించారు పాక్​ ప్రధాని ఇమ్రాన్​. అప్పటి నుంచి ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైంది. మే నెలలో ఆంక్షలను సడిలించారు. ఆ తర్వాత కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఇప్పటివరకు దాదాపు 2లక్షల మంది వైరస్​ బారినపడ్డారు. 4వేల 35మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి: ప్రపంచవ్యాప్తంగా కోటి దాటిన కరోనా కేసులు

Last Updated : Jun 28, 2020, 12:27 PM IST

ABOUT THE AUTHOR

...view details